ఎన్నికల కమిషినర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈమధ్య కాలంలో ఏపీ రాజకీయాల్లో చాలామంది ప్రముఖ నాయకుల కంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు. స్థానిక ఎన్నికల వ్యవహారం మొత్తం రమేష్ కుమార్ చుట్టూ తిరుగుతూ ఉంది. నిజానికి స్థానిక ఎన్నికలు జరిగి ఉండాల్సింది కానీ అప్పుడు కరోనా రావడంతో రమేష్ కుమార్ వాటికి వాయిదా వేశారు. అయితే ప్రభుత్వంతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా వాయిదా వేస్తారని వైసీపీ ప్రభుత్వం ఆయనను విధుల నుండి తప్పించగా, ఆయన కోర్ట్ లో పోరాడి మరి తన అధికార హోదాను దక్కించుకున్నారు. ఇప్పుడు న్కరోనా తగ్గుమొఖం పట్టడంతో, అలాగే బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో స్థానికుల ఎన్నికల నిర్వహణకు రమేష్ కుమార్ సిద్ధమవుతున్నారు.
ప్రపంచం మొత్తం కరోనా భయంతో వనికిపోతున్న తరుణంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ నేతలు, సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా హడావిడి చేశారు. ఇప్పుడు కరోనా తగ్గుమొఖం పడుతున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామంటే వైసీపీ నేతలు వద్దంటున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు ఉద్ధృతంగా పెరుగుతున్నాయని, మళ్లీ నవంబర్‌లో సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని, అందుకే ఇప్పుడు ఎన్నికలు నిర్వహించవద్దని ప్రభుత్వ సీఎస్ లేదని నీలం సహాని ఎన్నికల అధికారులకు చెప్తున్నట్టు తెలుస్తుంది.
కానీ రమేష్ కుమార్ స్థానికులు ఎన్నికలు ఎలాగైనా నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు ఉన్నారు అందుకే హై కోర్ట్ నుండి కూడా స్థానిక ఎన్నికల నిర్వహణకు అనుమతి తెచ్చుకున్నారు. రమేష్ కుమార్ పదవి కాలం వచ్చే సంవత్సరం మార్చ్ నాటికి పూర్తి ఆలోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రమేష్ ప్రయత్నిస్తుంటే వైసీపీ నేతలు మాత్రం అప్పటి వరకు స్థానిక ఎన్నికలు నిర్వహించడకుండా అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రభుత్వ అధికారులు కూడా ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కోర్ట్ కూడా చెప్పింది కాబట్టి రమేష్ స్థానిక ఎన్నికలు నిర్వహిస్తారో లేదా వైసీపీ ప్రభుత్వం ఆ ఎన్నికలను ఎలా అడ్డుకుంటుందో వేచి చూడాలి.