ఏపీ లో జరుగుతున్నా పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య కాకుండా ఎలక్షన్స్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ అధికార పార్టీ మధ్య జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఒకరికి మరొకరికి కౌంటర్ వేసుకోవటం, ఒకరి మీద మరొకరు కోర్టు మెట్లెక్కటం లాంటివి చేస్తున్నారు. నిమ్మగడ్డ రమారమి ఉంటే మరో రెండు నెలలు మాత్రమే పదవిలో ఉంటాడు, ఈ లోపే అయన చేయాల్సిన పనులన్నీ వేగంగా చేస్తున్నట్లు అర్ధం అవుతుంది.
నిమ్మగడ్డ వ్యవహార శైలి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. టీడీపీ సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్యకు పాల్పడితే స్వయంగా అక్కడకు వెళ్లి పరామర్శించడం కూడా చర్చనీయాంశంమైంది. టీడీపీ ప్రతినిధిగా, లోకేష్ కు పైలట్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అక్కడకు వెళ్లారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో నేరుగా ప్రభుత్వంపై ఆరోపణలు చేయటానికి కూడా నిమ్మగడ్డ వెనకడుగు వేయటం లేదు. తాను తీసుకొచ్చిన యాప్ మీద ప్రభుత్వం న్యాయస్థానానికి వెళ్లకుంటే ఆశ్చర్యపడేవాడినని సెటైర్ వేశారు.
ఇక అధికారుల విషయంలో కూడా నిమ్మగడ్డ వ్యవహార శైలి కఠినంగా కనిపిస్తుంది పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ లను నిర్భంధ పదవీ విరమణ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ డీవోపీటీకి లేఖ రాశారు. అధికారులు ఎవరి కనుసన్నల్లో పనిచేస్తారో ఆ మాత్రం నిమ్మగడ్డకు తెలియదా..? ఈ లేఖ అధికార వర్గాల్లో కలకలం రేపింది.
ఇవే కాకుండా రాబోయే రోజుల్లో కూడా నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టె విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు, ఉండేది రెండు నెలలే అయినాకని ఈ లోపే తాను అనుకున్నవి చేయాలనే ఆలోచనలో నిమ్మగడ్డ ఉన్నట్లు తెలుస్తుంది. కేవలం రెండు నెలలు అధికారంలో ఉండే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంత పంతంతో ఉంటే , రాబోయే మూడేళ్లు అధికారంలో ఉండే జగన్ సర్కార్ కూడా నిమ్మగడ్డ విషయంలో అంతకంటే ఎక్కువ పంతంతో ఉన్నట్లు తెలుస్తుంది