గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది. ఏపీలో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైందని.. స్థానిక సంస్థల ఎన్నికలను త్వరలోనే నిర్వహించనున్నారనేది ఆ పోస్టు కథనం.
అంతే కాదు.. మూడు దఫాలుగా ఎన్నికలను నిర్వహించున్నారని.. దీనిపై ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నీ సిద్ధం చేసుకుంటున్నారని.. కేంద్రం ఎన్నికల సంఘం నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసిందని వార్తలు వచ్చాయి.
దానితో పాటు ఎన్నికల షెడ్యూల్ కూడా ఇదే అంటూ ఓ సర్క్యూలర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో చాలామంది ఇది నిజమే కాబోలు..ఆంధ్రప్రదేశ్ ఇక మళ్లీ ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి అని అనుకున్నారు.రేపో మాపో ఎన్నికల అధికారి ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా ప్రకటిస్తారు… అంటూ వార్తలు హల్ చల్ చేశాయి. అయితే అది అబద్ధామా? నిజమా? అని జనాలు తేల్చుకోలేకపోయారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పోస్టులకు చెక్ పెట్టారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. ఆవన్నీ ఫేక్ అని.. ఏపీలో ఎన్నికల గురించి ఎటువంటి అధికారిక ప్రకటనను ఎన్నికల సంఘం రిలీజ్ చేయలేదని.. ఎన్నికల సంఘం పేరుతో వైరల్ అవుతున్న ఎన్నికల షెడ్యూల్ ఫేక్ అని నిమ్మగడ్డ స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడంలో ఆయన సీరియస్ అయ్యారు. వెంటనే సీపీతో సహా ఆయన సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో, సైబర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫేక్ సర్క్యూలర్ ను పోస్ట్ చేసిన వాళ్ల కోసం వెతుకుతున్నారు.