Poll : ఫిబ్రవరి లో పంచాయతీ ఎన్నికలు జరపాలంతున్న నిమ్మగడ్డ రమేష్ నిర్ణయం సరైనదేనా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్- ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మధ్య కొనసాగుతున్న వివాదం గురించి తెలిసిందే. ఎవరూ ఈ విషయంపై పట్టు సడలించడం లేదు. అటు నిమ్మగడ్డ ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు కానీ ఎన్నికలకు కావాల్సిన ఫండ్స్, మిషనరీ పంపించాల్సివుంది ప్రభుత్వమే అన్న విషయాన్ని మరిచినట్టు ఉన్నారు.

Nimmagadda ramesh kumar Comments on AP Local Body Elections 2020
Nimmagadda ramesh kumar Comments on AP Local Body Elections 2020

హైకోర్టు ఉంది కదా అని ఒకపక్క నిమ్మగడ్డ చెలరేగిపోతుంటే జగన్ మాత్రం శాంతంగా తన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే కొద్ది నెలల్లో నిమ్మగడ్డ రిటైర్ కాబోతున్నారు కాబట్టి అప్పటి వరకు వైసిపి నాయకులు ఈ ప్రక్రియను జాప్యం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి వాతావరణంలో నిమ్మగడ్డ ఫిబ్రవలోరి ఎట్టిపరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలు జరిపించాలని ఫిక్స్ అయి కూర్చున్నారు.

ఏపీ ప్రజలు దీనిపై ఏమి అనుకుంటున్నారు అనే విషయంపై మాత్రం ఎవరికీ స్పష్టత లేదు. ప్రజాస్వామ్యం ప్రథమ అంశం అయిన ఈ దేశంలో రెండు అత్యున్నత వ్యవస్థలు ఒక దానితో ఒకటి కొట్టుకోవడం వల్ల సామాన్యుడు పై చూపే ప్రభావం అంతా ఇంతా కాదు. మరి ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరపాలి అనుకుంటున్న నిమ్మగడ్డ రమేష్ నిర్ణయాన్ని సమర్ధించే వారు ఎవరు? వ్యతిరేకించేవారు ఎవరు అన్న విషయంపై చర్చ జరుగుతోంది….

ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకోవాలని తెలుగురాజ్యం ప్రయత్నిస్తుంది. కింద పోల్ లో మీ ఓటు వేసి మీ అభిప్రాయం చెప్పండి.

[poll id=”16″]