జగన్ సర్కారుకు షాకిచ్చిన నిమ్మగడ్డ.. ఏకంగా హైకోర్టులో పోరుకు సిద్దం.. ??

YS Jagan Mohan Reddy

 

గతంలో వైసీపీ సర్కారుకూ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కూ మధ్య జరిగిన పోరు ఇంకా పూర్తిగా మరచి పోకముందే వైఎస్ జగన్ సర్కార్ పై మరో కొత్త యుద్ధానికి తెర తీసారు.. ఎన్నికల కమిషన్‌కు వైసీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెలలో కరోనా కారణంగా స్ధానిక ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి ఆయన్ను వైసీపీ ప్రభుత్వం తొలగించడం, ఆ తర్వాత కోర్టు తీర్పులతో తిరిగి ఆయన పదవిలోకి రావడం అందరికి తెలిసిందే..

అయితే తమ అభీష్టానికి వ్యతిరేకంగా హైకోర్టు ఉత్తర్వులతో తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా మళ్లీ నియమించబడిన నిమ్మగడ్డ రమేష్‌ను ఏపీ సర్కార్‌ టార్గెట్ చేస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో నిమ్మగడ్ద కూడా ఎన్నికల విషయంలో హైకోర్టును ఆశ్రయించడం చర్చాంశనీయమైంది.. అయితే వైఎస్ జగన్ సర్కార్ ఏపీలో ఎన్నికల కమిషన్ నిర్వహణకు ఖర్చయ్యే నిధులను మంజూరు చేయకుండా అడ్దుకుంటుందని, ఇలా చేయడం వల్ల ఎన్నికల సంఘం నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాక ఇబ్బందులు పడుతున్నట్లు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని కూడా తన పిటిషన్‌లో పేర్కొన్నారు..

ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్243(కే) ప్రకారం ఎన్నికల కమిషన్‌కు నిధులు ఆపేయడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ, ఈ విషయంలో కోర్టు వెంటనే జోక్యం చేసుకుని వెంటనే నిధులు విడుదల అయ్యేలా చూడాలని ఆయన కోరారు. కాగా ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీలను పేర్కొనగా, సీతారామమూర్తి, అశ్వినీకుమార్, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరఫున‌ వాదనలు వినిపించారు..