నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం రోజురోజకూ కొత్త మలుపులు తిరుగుతుంది. ఈరోజు హైకోర్టు ఆదేశాలు ప్రకారం గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్‌తో నిమ్మగడ్డ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు 30 నిమిషాల పాటు గవర్నర్‌తో నిమ్మగడ్డ చర్చించారు.
ఈ సందర్భంగా హైకోర్టు తీర్పును అమలు చేయాలని, తనను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని గవర్నర్‌ను కోరారు. దీంతో తన విజ్ఞప్తిని విన్న గవర్నర్ సానుకూలంగా స్పందించారని, ఈ క్రమంలో తనకు అనుకూలంగా ఫలితం వస్తుందని మీడియా ముఖంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.
అయితే నిమ్మగడ్డ అలా గవర్నర్‌ను కలిశారో, ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్‌గా మారింది. అసలు మ్యాటర్‌లోకి వెళితే, ఏపీ ప్రభుత్వం పై నిమ్మగడ్డ హైకోర్టులో కోర్టు థిక్కరణ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై సుప్రీంకోర్టులో స్టే కోసం ఏపీ సర్కార్ పిటీషన్ వేసింది.
ఈ క్రమంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో కోర్టు ధిక్కారణ పిటీషన్ పై స్టే ఇవ్వాలని, ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం విశేషం. ఈ నేపధ్యంలో సుప్రీం కోర్టులో కేసు పెండింగులో ఉండగా, హైకోర్టు కోర్టు ధిక్కారణ కేసు ఎలా తీసుకుంటుందని ఏపీ ప్రభుత్వం ప్రశ్నించింది. మరి ఈ వ్యవహారం పై సుప్రీ కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏది ఏమైనా నిమ్మగడ్డ వ్యవహారం మరో కొత్త మలుపుతో ఆశక్తికరంగా మారిందని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు.