Night Curfew: ఎల్లుండి నుంచి కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ

Night Curfew: కరోనా కొత్త వేరియంట్ చాపకింద నీరులా ప్రపంచమంతా వ్యాపిస్తుంది. ప్రపంచ దేశాలకు చుక్కలు చూపించిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం భారత్ ను కూడా కలవరపెడుతుంది. దేశం వ్యాప్తంగా ఇప్పటివరకు 17 రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య క్రమ క్రమంగా 422కు చేరుకుంది. అందులో 130 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో నాలుగో రోజుల్లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమవుతుండటంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరించిన సంగతి తెల్సిందే. దీంతో అప్రమత్తుమైన కేంద్ర ప్రభుత్వం స్థానిక పరిస్థితుల ఆధారంగా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆంక్షలు విధించాలని ప్రధాని మోదీ సూచిం చారు.

దీంతో న్యూ ఇయర్ వేడుకలు, సంక్రాంతి పెద్ద పండుగ పేరుతో పందాలు, షాపింగ్ లు ఇలా ఎక్కడ చూసిన జనం గుంపులు గుంపులుగా కనిపించే ప్రమాదం ఉంది. దీంతో గుబులు మరింత పెరుగుతుంది. అందుకే అన్ని రాష్ట్రాలు ఇప్పటికే అప్రత్తమయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు క్రమంగా ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో రాత్రి పూట కర్ఫ్యూ ని విధించగా .. తాజాగా ఈ జాబితాలోకి కర్ణాటక కూడా వచ్చి చేరిపోయింది. డిసెంబర్ 28 నుంచి కర్ణాటకలో కూడా రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ నిబంధనలు అమలులో ఉంటాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ వెల్లడించారు.

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ ఆధ్వర్యంలో మంత్రులు, అధికారులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఒమిక్రాన్​ వ్యాప్తి నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలపై బహిరంగ ప్రదేశాల్లో నిషేదం విధించినట్లు తెలిపారు. పబ్​లు, బార్​లు, హోటల్​లో 50 శాతం సిటింగ్​కే పరిమిషన్​ ఇచ్చినట్లు కూడా తెలిపారు. ఈ నిబంధన సినిమా థియేటర్లకు వర్తించదని వివరించారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ఇప్పటికే తొలి డోస్ 97 శాతం మందికి వ్యాక్సినేషన్​ పూర్తయిందని.. మిగిలిన 3 శాతం మందికి వ్యాక్సినేషన్​ త్వరలోనే పూర్త చేస్తామని వెల్లడించారు.

జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు మొదటి దశ టీకాలు వేయడం ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. సుమారు 45 లక్షల మంది పిల్లలు ఉంటారని పేర్కొన్నారు. అంతే కాకుండా ఆరోగ్య రంగంలో పనిచేస్తున్నవారికి మూడో డోసు కూడా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.