New Year Special: నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి మద్యం దుకాణాలు, బార్ లు, పబ్ లు, స్పెషల్ ఈవెంట్స్ కు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం. వీటికి సంబంధించి సర్కార్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. డిసెంబర్ 31వ తేదీన మద్యం దుకాణాలకు అర్ధరాత్రి 12 గంటల వరకు బార్ లు, టూరిజం బార్ లకు, స్పెషల్ ఈవెంట్స్ లకు, రాత్రి 1 గంట వరకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఒకవైపు కరోనా విజృభింస్తున్నవేళ న్యూ ఇయర్ వేడుకల పై ఆంక్షలు విధిస్తారని అంతా భావించారు. కానీ, ప్రభుత్వం అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కాలంలో హైదరాబాద్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్లు జరగడం, చాలామంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. మొన్నటి మొన్న కూడా ఒక మహిళ డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ వల్ల ప్రాణాలు కోల్పోయింది. ఈ క్రమంలో మద్యం షాపులకు ఫ్రీడమ్ ఇవ్వడం విమర్శలకు దారి తీస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు కూడా ఫైర్ అవుతున్నాయి. రాజకీయ సభలు, సమావేశాలకు అనుమతులు కోరితే కరోనా పేరుతో నిరాకరించిన ప్రభుత్వం.. ఇప్పుడెలా మద్యం దుకాణాలకు, బార్లకు, అనుమతులు జారీ చేసారంటూ నిప్పులు చెరుగుతున్నారు.