ప్రపంచ దేశాలు సహా భారత్ ను కరోనా వైరస్ ఒణికిస్తుంటే! స్వదేశంలోని ఈశాన్య రాష్ర్టాలో మరో వైరస్ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఈశాన్య రాష్ర్టాలైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లో కరోనా ప్రభావం అంతగా లేదు. కానీ ఇప్పుడొచ్చిన వైరస్ ఆ రెండు రాష్ర్టాల ప్రజల్లో అంతకంతకు ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఆ ప్లూ వైరస్ ను వైద్యులు గుర్తించారు. ఆప్రికన్ స్వైన్ ఫీవర్ గా పిలవబడే ఈ వైరస్ వల్ల ఇప్పటికే అస్సాంలో 15 వేల పందులు మృత్యువాత పడ్డాయి. ఇంకా మరిన్ని పందులకు ఈ వైరస్ సొకింది అన్న అనుమానం ఉంది. దీంతో పదులన్నింటీకి పరీక్షలు నిర్వహించే పనిలో అక్కడి ప్రభుత్వం పడినట్లు సమాచారం.
ఓ పక్క నివారణ చర్యలు చేపడుతున్నారు. అయితే ఇలా ఎన్ని నివారణ చర్యలు చేపట్టినా ఒక మనిషికి గనుక ఈ వైరస్ సోకితే దాన్ని అదుపు చేయలేమని భావించిన అక్కడ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ర్టంలో వైరస్ సోకిన పందులన్నింటిని గురించి ఒకేసారి చంపేయాలని నిర్ణయించారు. ఈ నేపధ్యంలోనే రాష్ర్ట వ్యాప్తంగా ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ప్రస్తుతానికి పందులు తినకూడదని…అసలు పంది వైపు చూడొద్దని హెచ్చరికలకు జారీ చేసింది ప్రభుత్వం.
ఆ రాష్ర్ట పశుసంవర్ధక మరియి పశు వైద్య విభాగం డైరెక్టర్ పులిన్ దాస్ నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరుగుతుందిట.అయితే పందులను చంపడం వల్ల వాటిపై జీవనం సాగించే వారికి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అస్సాంలో పంది మాంసానికి గిరాకీ ఎక్కువ. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఆర్ధిక సహాయం కావాలని రాష్ర్ట ప్రభుత్వం కోరింది. కేంద్రం గ్రీన్ సిగ్నెల్ ఇవ్వగానే పందులపై ఆపరేషన్ మొదలవుతుందని తెలుస్తోంది.