వైద్యుల నిర్లక్ష్యం నెలలు నిండకనే గర్భిణీ ఆపరేషన్ చేసిన డాక్టర్లు… చివరికి ఏమైందంటే?

సాధారణంగా మహిళలు గర్భం దాల్చిన సమయంలో నుండి డాక్టర్ ఇచ్చిన సూచనల మేరకు సమయానికి ఆహారం తింటూ మందులు ఉపయోగిస్తూ ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ ఉంటారు. గర్భవతులుగా ఉన్న మహిళలను కనీసం నెలకు ఒకసారి హాస్పిటల్ కి తీసుకెళ్లి తల్లి బిడ్డ పరిస్థితిని తెలుసుకుంటూ ఉంటారు ఇలా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు గర్భవతుల పట్ల ఎంతో జాగ్రత్త వహిస్తారు. అలాగే డాక్టర్లు కూడా వారిపట్ల ఎంతో జాగ్రత్త వహించి సకాలంలో వారికి ఎటువంటి అపాయం లేకుండా ప్రసవం చేయటానికి చూస్తారు. కానీ ఇటీవల ఒక డాక్టర్ చేసిన పని అందరిని ఆశ్చర్యపరిచేలా చేసింది. అస్సాంలో ఒక వైద్యుడు చేసిన నిర్వాకానికి చాలా పెద్ద పొరపాటు జరిగింది. నెలలో నిండకముందే ఒక గర్భిణీకి ప్రసవం చేయాలని ప్రయత్నించాడు. కానీ తీరా పిండం ఎదుగుదల సరిగా లేదని తెలుసుకొని నిర్గాంత పోయాడు.ఈ ఘటన అసోంలోని కరీంగంజ్ సివిల్ హాస్పిటల్‌లో చోటుచేసుకుంది.

వివరాలలోకి వెళితే…కరీంగంజ్‌కు చెందిన ఓ గర్భిణి ఇటీవల కొంచెం అనారోగ్యంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆగస్టు 21వ తేదీన హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అయితే సదరు గైనకాలజిస్ట్ ఆమెను రెండు రోజులపాటు హాస్పిటల్ లో అబ్జర్వేషన్ లో ఉంచి ఆ తర్వాత ఎటువంటి అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేయకుండానే ఆమెకు సర్జరీ చేయాలని నిర్ధారించాడు. కనీసం ఆమెకు నెలలు నిండాయా లేదా అన్న సంగతి కూడా తెలుసుకోకుండానే దాదాపు మూడున్నర నెలలో ముందే ఆమెకు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో సర్జరీ చేసిన తర్వాత పిండం ఇంకా పూర్తిగా వృద్ధి చెందలేదని గ్రహించిన డాక్టర్ తాను చేసిన పొరపాటు తెలుసుకొని వెంటనే బిడ్డను ఎదా స్థానంలో ఉంచి తిరిగి కుట్లు వేశాడు.

అయితే ఈ విషయాన్ని ఎవరితోనో చెప్పవద్దని ఆ వైద్యుడు కుటుంబ సభ్యులను వేడుకొని ఆమెను ఆగస్టు 31వ తేదీన హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశాడు.
ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ గర్భిణీ ఆరోగ్య పరిస్థితి క్షీణించటంతో ఇరుగుపొరుగు వారికి బంధుమిత్రులకు కుటుంబ సభ్యులు ఈ విషయం వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ అధికారుల ముందుకు ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. దీంతో హాస్పిటల్ అధికారులు సదరు గర్భిణీకి వారి హాస్పిటల్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని హాస్పిటల్ యాజమాన్యం గర్భిణీ కుటుంబ సభ్యులకు వెల్లడించింది. ఈ క్రమంలో 11 మంది కమిటీ సభ్యులను ఏర్పాటు చేసి ఈ విషయం గురించి దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటికే ప్రాథమిక రిపోర్టుని ఆరోగ్య శాఖకు సమర్పించినట్లు హాస్పిటల్ అధికారులు వెల్లడించారు.