ఆయిల్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. కెమిస్ట్ పోస్టుల భర్తీ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ విడుదల కానుంది. oil-india.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. జులై నెల 11వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. 24 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుండి రెండేళ్ల వ్యవధిలో కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడాది పాటు అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 70,000 రూపాయల వేతనం లభించనుందని సమాచారం అందుతోంది.
వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. సంస్థ అస్సాం అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగానే ఉండనుందని చెప్పవచ్చు. ఈ జాబ్స్ వల్ల నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఆయిల్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగం కోరుకునే వాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు అనుభవం పెరిగే కొద్దీ వేతనం మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్స్ ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది.