చూస్తుంటే 2020 వైరస్ ల సంవత్సరంలా కనిపిస్తోంది. 2019లోచైనా బయటపడిన వైరస్ 2020 నుంచి ప్రపంచాన్ని కబళించడం మొదలు పెట్టింది. ఇప్పటికే వరల్డ్ వైడ్ లక్షల్లో మరణాలు చోటు చేసుకున్నాయి. అయినా కరోనా ఇంకా శాంతిచలేదు. చైనా పురుడు పోసి పంపిన వైరస్ ప్రపంచం మీద ఇంకా పగతీర్చుకుంటూనే ఉంది. ఇది ఎప్పుడు అంతమవుతుందో తెలియని పరిస్థితి. ఓ వైపు వైరస్ విరుగుడు వ్యాక్సిన్లకు సంబంధించి ప్రయోగాలు జరుగుతున్నా! అదిగో పులి ఇదిగో తోక అన్నట్లు ప్రచారం తప్ప వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఉన్నంత కాలం కరోనాతో కలిసి జీవించాల్సిందేనని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తేల్చేసినప్పుడు? ఇంకేం చేయగలం. ఇది కరోనా కథ.
ఇక్కడితో ఈ సమస్య సమసిపోలేదు. ప్రపంచం మీద దాడి చేయడానికి ఇంకా కొత్త వైరస్ లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. జీ-4 అనే కొత్త వైరస్ పేరు ఇప్పటికే తెరపైకి వచ్చింది. మూడు జీవుల సమ్మేళనంగా వైరస్ పుట్టక జరిగింది. వైరస్ పుట్టుకలో ప్రధాన పాత్ర పోషించింది పందులు. మానవాళిని కబళించడానికి జీ-4 దూసుకొస్తుంది. దీనిపై ఇప్పుడు చైనాలో తీవ్రంగా పరిశోధలను జరుగుతున్నాయి. అయితే జీ4 ఇంకా పరిశోధన దశలో ఉండగానే మరో కొత్త వైరస్ తెరపైకి వచ్చింది. దాని పేరు బుబోనిక్. ఇది కరోనా , జీ-4 లాంటి వైరస్ కాదు. నెమ్మదిగా ప్రాణాలు తీసే వైరస్ అంతకన్నా కాదు. బుబోనిక్ సోకిందంటే ఏకంగా 24 గంటల్లోనే మృత్యువాత పడాల్సిందే. అవును ఇది అక్షర సత్యం. 24 గంటల్లో వైరస్ విరుగుడు మందు వేయకపోతే కైలాశమే.
ఈ వ్యాధి ఉడతలు, ఎలుకలు తినడం వల్ల వైరస్ జన్యు రూపం దాల్చుతుందని శాస్ర్త వేత్తలు గుర్తించారు. ఇదొక రకమైన బ్యాక్టిరియా అంట. బయన్నూర్ అనే పట్టణంలో మొదటగా దీన్ని గుర్తించారు. మార్మట్ అనే జాతి ఉడతను తినడం వల్ల ఈ బ్యాక్టిరియా పుడుతుందిట. ప్రస్తుతం బయన్నూర్ లో పరిస్థితి ఆందోళన కరంగానే ఉందని తెలుస్తోంది. ఇప్పుడా ప్రాంతంలో లెవల్ 3 హెచ్చరికలు అమలులో ఉన్నాయి. మరో ఆసక్తికర సంగతేంటంటే? 1911లో వచ్చిన ప్లేగు వ్యాధికి ఈ మార్మట్ మాంసంమే కారణమంటోంది సైన్స్. ఈ వ్యాధి వల్ల అప్పట్లో చైనాలో 63 వేల మంది చనిపోయారు. మధ్యయుగం కాలంలో యూరప్ లో 50 మిలియన్ల మంది మృత్యువాత పడ్డారు. మళ్లీ కొన్ని దశాబ్ధాల అనంతరం ప్లేగు రూపంలో బుబోనిక్ దూసుకొస్తుంది. ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీనికి సంబంధించి అప్రమత్తమవ్వడం జరిగిందిట.