Crime News: కొత్త రకం దొంగతనాలు.. పోలీసుల ఇళ్లను సైతం వదలకుండా..!

Crime News:సాధారణంగా దొంగతనానికి వచ్చిన వారు డబ్బు నగలు వాహనాలు వంటి విలువైన వస్తువులను దొంగతనం చేస్తుంటారు.ఇంటికి తాళం వేసి ఒక్క రోజు ఎక్కడికైనా వెళితే చాలు ఆ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను మర్చిపోవలసి వస్తోంది. దొంగతనాలు చేసేవారు ఎంతో నైపుణ్యంగా నిఘా వేసి ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లో చొరబడి విలువైన వస్తువులను దొంగతనం చేస్తారు. ఇలా ప్రతిరోజు ఎన్నో రకాల దొంగతనం కేసులు నమోదవుతున్నాయి ఉన్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కొత్తరకం దొంగతనాలు వెలుగు చూస్తున్నాయి.

వివరాలలోకి వెళితే.. ఇటీవల కాలంలో పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ ప్రాంతాలలో కొత్త రకం దొంగతనాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా డబ్బు, నగలు,వాహనాలు వంటి విలువైన వస్తువులను దొంగతనం చేయటం అందరూ చూస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం అలాంటి విలువైన వస్తువులు ఏమి ముట్టుకోకుండా దొంగతనానికి వచ్చిన వారు వింతగా గ్యాస్ సిలిండర్లు దొంగతనం చేయటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పరిసర ప్రాంతాలలో దాదాపు 200 పైచిలుకు గ్యాస్ సిలిండర్లు దొంగతనం చేయబడ్డాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో ఈ దొంగతనానికి సంబంధించిన విషయాలు చర్చనీయాంశంగా మారాయి. ఇలా గ్యాస్ సిలిండర్లు దొంగతనం చేయటం వెనుక గల కారణాల గురించి తేలిక పోలీసులు సతమతమవుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో గ్యాస్ సిలిండర్లు దొంగతనం చేసే ముఠా చివరికి పోలీసుల ఇళ్లల్లో కూడా సిలిండర్లు దొంగతనం చేశారు అంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తరచూ ఇలాంటి దొంగతనాలు జరుగుతుండడంతో అక్కడి స్థానికులు డబ్బు, బంగారు
కంటే గ్యాస్ సిలిండర్లను భద్రంగా దాచుకుంటున్నారు. ఈ సంఘటనలపై అనేక కోణాలలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.