మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ వేగం పుంజుకోనుందా, కొత్త పేర్లు బయటికి రాబోతున్నాయా, అసలు నిందితులు పట్టుబడనున్నారా అంటే అనువనే అంటున్నాయి రాజకీయ వర్గాలు. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి తన ఇంటి బాత్రూలోనే గొడ్డలి వేటుకు బలయ్యారు. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉండటంతో వైసీపీ ఈ హర్యాలు చంద్రబాబు నాయుడుకు లింక్ ఉందని వాదించింది. దీంతో చంద్రబాబు విచారణ నిమిత్తం సిట్ బృందాన్ని ఏర్పాటుచేశారు. కానీ లాభం లేకపోయింది. ఆతర్వాత జగన్ సీఎం ఇవ్వగానే పాత సిట్ బృందాన్ని తొలగించి కొత్త బృందాన్ని నియమించారు. అక్కడా ప్రయోజనం లేకపోయింది. దీంతో వివేకా భార్య, కుమార్తెలు సీబీఐ విచారం కోరుతో హైకోర్టుకు వెళ్లగా కోర్టు సీబీఐని రంగంలోకి దింపింది.
ఇప్పటికే రెండు దశల్లో విచారణ జరిపిన సీబీఐ టీడీపీలోని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవిలతో పాటు వైఎస్ కుటుంబంలోని ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి , ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి మరో ఇద్దరు సోదరులను ప్రశ్నించింది. ఇంకా కొందరు విడి వ్యక్తులను విచారణ చేసి కీలక సమాచారం రికార్డ్ చేసింది. కానీ ఇంతలో కరోనా సోకడంతో ఆ బృందాన్ని తప్పించి కొత్త సీబీఐ బృందాన్ని రంగంలోకి దింపింది. కొత్త ఎఫ్ఐఆర్ కూడ నమోదైంది. దీంతో కడపలో వాతావరణం హీటెక్కింది అంటున్నాయి రాజకీయ వర్గాలు.
కొందరు పెద్దలు విచారణ ఎలా నడుస్తుంది, ఏ మలుపు తీసుకుంటుంది, తమ వద్దకు వచ్చి ఆగుతుందా అంటూ కంగారుపడిపోతున్నారట. డీఎస్పీ దీపక్ గౌర్ అధికారిక త్వరలో స్పెషల్ టీమ్ విచారణ మొదలుపెట్టనుంది. ఈ విచారణలో ప్రముఖుల పేర్లు బయటికొచ్చే అవకాశం ఉందని, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు ఒక కొలిక్కి రావడం, ఊహించని వ్యక్తులు అరెస్ట్ కావడం జరుగుతుందని రాజకీయ వర్గాల్లో బలమైన చర్చ నడుస్తోంది. మరి సీబీఐ కొత్త బృందం ఎవరి పేర్లను బయటకు తీస్తుందో, ఎవరిని రౌండప్ చేస్తుందో చూడాలి.