ఇండస్ట్రీ టాక్ : పాపం అఖిల్ భారీ సినిమాకి మళ్లీ కొత్త కష్టాలు.!

akhil s agent  : అక్కినేని కుటుంబం నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో అడుగు పెట్టిన మరో యంగ్ హీరో అఖిల్ అక్కినేని. అయితే ప్యాక్ట్ మాట్లాడుకుంటే అసలు అక్కినేని కుటుంబం లో ఏ హీరోకి కూడా లేని క్రేజ్ గాని అఖిల్ సినిమాలకి ఉంటుంది. అందుకే తన స్టార్టింగ్ మూడు సినిమాలు ప్లాప్ అయినా నాలుగో సినిమాకి కూడా మంచి బిజినెస్ జరిగింది. ఫైనల్ గా హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ కూడా సాధించింది. ఇక ఆ సినిమా హిట్ అవ్వడంతో అఖిల్ నుంచి ఒక ఊహించని భారీ సినిమా అనౌన్స్ అయ్యింది.

ఆ సినిమానే “ఏజెంట్” మన తెలుగు స్టార్ డైరెక్టర్ అయినటువంటి సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది. అయితే ఇది వరకే ఈ సినిమాకి పలు ఇబ్బందులు ఎదురవ్వడం తెలిసిందే. వాటిని దాటి మేకర్స్ సినిమాని పూర్తి చేశారు. కానీ లేటెస్ట్ గా ఇండష్ట్రీ వర్గాల్లో లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు తాజాగా కొత్త చిక్కులు వచ్చి పడ్డాయట.
సినిమా మళ్లీ కొన్ని పార్ట్స్ రీ షూట్ చేసే అవకాశం ఉందని మరి దీనితో అయితే ఈ చిత్రం అనుకోని విధంగా విడుదల లేట్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఈ సినిమా ఆగస్ట్ రేస్ నుంచి తప్పుకున్నట్టే అని చెప్పాలి.  అయితే దీనిపై మాత్రం ఇంకా అధికారిక క్లారిటి కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ సినిమా నిర్మాత కళ్యాణ్ సుంకర ని కూడా అక్కినేని అభిమానులు అడుగుతున్నారు. భారీ బడ్జెట్ మరియు హంగులతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.