విద్యుత్ ఘాతంతో మృతి చెందిన నవ వరుడు.. కన్నీళ్లు పెట్టిస్తున్న మృతుడి భార్య రోధన!

కొన్ని కొన్ని సందర్భాలలో అనుకొని ప్రమాదాల వల్ల క్షణాలలో ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల వల్ల ఎంతోమంది కరెంటు షాక్ తో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల కూడా ఇటువంటి విషాద ఘటన చోటు చేసుకుంది. వల్లూరుపాలెం గ్రామానికి చెందిన వల్లభాపురపు శ్రీనివాసరావు(29) శుక్రవారం రోజు నూతనంగా నిర్మిస్తున్న ఓ ఇంట్లో కరెంటు పనులు చేస్తుండగా విద్యుత్ ఘాతం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లి మూడు నెలలు కూడా గడవకుండానే భర్త ఇలా ప్రాణాలు కోల్పోవడంతో ఆ భార్య రోదన వర్ణాతీతంగా మారింది.

వివరాలలోకి వెళితే…శ్రీనివాసరావు వల్లూరుపాలెంలో కొత్తగా నిర్మిస్తున్న ఇంట్లో కరెంటు పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో కొంతమంది కూలీలు శుక్రవారం ఉదయం గోడలకు గాడులు కొట్టి వెళ్లిపోయారు. శ్రీనివాసరావు ఆ యంత్రానికి ఉన్న కరెంటు తీగను చుడుతున్న సమయంలో అనుకోకుండా విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కొంత సమయం తర్వాత పై అంతస్తులు తాపీ పనులు చేస్తున్న కొందరు కూలీలు కిందికి వచ్చి చూడగా శ్రీనివాసరావు కింద పడిపోయి ఉండటంతో దగ్గరకు వెళ్లి చూశారు.

దీంతో శ్రీనివాసరావు విద్యుత్ ప్రమాదం వల్ల మృతి చెందినట్లు నిర్ధారించి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శ్రీనివాసరావుకు మూడు నెలల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం అతని భార్య గర్భంతో ఉంది. శ్రీనివాస్ రావు మరణ వార్త తెలుసుకున్న భార్య కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్నా కుమారుడు ఇలా విద్యుత్ ఘాతం వల్ల మరణించడంతో ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. పెళ్లి జరిగి మూడు నెలలు కూడా గడవకుండానే కట్టుకున్న భర్త ఇలా కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ యువతి రోదన వర్ణాతీతంగా మారింది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శ్రీనివాసరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీనివాసరావు తండ్రి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.