మళ్లీ గొడవ.. కేసీఆర్, జగన్ మధ్య సరికొత్త ఫైట్.. షాకైన రెండు రాష్ట్రాలు 

KCR-Jagan
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్యన స్నేహం బలపడింది.  జగన్, కేసీఆర్ ఇద్దరూ చాలా సఖ్యతతో మెలిగారు.  తరచూ సమావేశమవుతూ సమస్యల పరిషపరిష్కారానికి మార్గం వెతుకుతున్నామని అన్నారు.  మరీ ముఖ్యంగా ఏళ్ల తరబడి అలాగే ఉన్న నీటి కేటాయింపుల సమస్యను పరిష్కరిస్తాం అన్నారు.  కేసీఆర్ అయితే బేసిన్లు లేవు భేషజాలు లేవు అన్నారు.  కానీ యేడాది తిరిగేసరికి పాత నీటి  గొడవలే మళ్లీ మొదలయ్యాయి.  అయితే ఈసారి కొత్తగా.  వైఎస్ జగన్ తెలంగాణ రాష్ట్రానికి సమాచారం ఇవ్వకుండానే రాయలసీమ ఎత్తిపోతల పథాకానికి సిద్దమయ్యారు.  జీవో జారీచేసి, టెండర్లు పిలవాలని అనుకున్నారు. 
 
KCR-Jagan
 
ఈ సంగత తెలియడంతోనే తెలంగాణలోని అన్ని పార్టీలు భగ్గుమన్నాయి.  కేసీఆర్ ఇచ్చిన చనువుతోనే ఈ జల దోపిడీ జరుగుతోందని మండిపడ్డాయి.  మొదట్లో మౌనంగానే ఉన్న కేసీఆర్ మెల్లగా స్పందించారు.  రాయలసీమ ఎత్తిపోతల పథకం ముమ్మాటికీ తప్పేనని, అది తెలంగాణలోని కొన్ని జిల్లాలకు తీరని నష్టం చేస్తుందని, ఎట్టి  పరిస్థితుల్లోనూ ఆ ప్రాజెక్టును ఆడుకుని తీరుతామని బల్లగుద్ది చెప్పారు.  క్రిష్ణా నదీ యాజమాన్య బోర్డు ముందు బలమైన వాదనలు వినిపించి బోర్డు ద్వారా ప్రాజెక్టును ఆపాలనే ఉత్తర్వులు వెలువడేలా చేసింది.  దీంతో ఏపీ ప్రభుత్వం కాళేశ్వరం సహా తెలంగాణ ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టులన్నీ చట్ట విరుద్దమే అంటూ కొత్త వాదన స్టార్ట్ చేసింది.  దీంతో కేసీఆర్ ఫుల్ ఫైర్ అయ్యారు.  
 
నిన్న సమీక్ష నిర్వహించిన ఆయన అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి సిద్దమని అన్నారు.  తెలంగాణలో కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టలేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ప్రాజెక్టులనే రాష్ట్ర అవసరాలను తీర్చే విధంగా రీడిజైన్‌ చేశామని, ఈ విషయాన్ని ఆధారాలతో చెప్పాలని,  అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఫైనల్ చేసుకున్నారు.  పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుతో పాటు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై గట్టిగా అభ్యంతరం తెలిపి ట్రైబ్యునల్‌ అవార్డుకు భిన్నంగా గోదావరి, కృష్ణా నదుల్లో ఆంధ్రప్రదేశ్‌ అక్రమంగా వాడుకుంటుందని నిలదీయడానికి డిసైడ్ అయ్యారు.  రోజు రోజుకూ ముదురుతున్న ఈ వాటర్ వార్ చూసి ఇరు రాష్ట్రాల ప్రజలు షాకవుతున్నారు.