కరోనా మహమ్మారి ప్రపంచంలోని ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది. చాలామంది చాలామంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోగా, ఇంకొంత మంది కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందుల వల్ల చనిపోయారు. ప్రజలను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెడ్తుంది.
ఏపీలో మొదట ప్రభుత్వం కరోనాపై సరైన శ్రద్ధ చూపించడం లేదని విమర్శలు ఎదుర్కొన్నా తరువాత ప్రపంచ దేశాల నుండి కూడా ప్రసంశలు పొందింది. మొన్నటి వరకు రోజుకు 10000 కేసులు నమోదు అయ్యాయి. అయితే గత మూడు రోజుల నుండి మాత్రం కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 44578 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 6780మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 296609కి చేరింది. అంటే దాదాపు 3 లక్షలకు కేసులు చేరాయి.
రాష్ట్రంలో కొత్తగా నమోదు అవుతున్న వారి సంఖ్య పెరగడం లేదు. కానీ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆదివారం ప్రభుత్వం ఇచ్చిన బులిటెన్ ప్రకారం ఏపీలో కరోనాతో 82మంది మరణించారు. దీంతో ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 2732కు పెరిగింది.అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 13మంది తూర్పు గోదావరిలో 10మంది మరణించారు. ఆదివారం 10117మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 84777 యాక్టివ్ కేసులు ఏపీలో ఉన్నాయి. దేశంలో కరోనాపై అత్యధిక టెస్టులు నిర్వహిస్తున్న రాష్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. కరోనా కేసులు తగ్గడానికి ప్రభుత్వం తీసుకున్న విధానాల వల్లే సాధ్యం అయ్యిందని వైద్యులు తెలుపుతున్నారు. కరోనాను కట్టడి చేయడంలో గ్రామ వాలంటీర్ల కృషి వర్ణించలేనిదని వైసీపీ నేతలు చెప్తున్నారు. వారే గ్రామంలోని ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ ను గుర్తించి టెస్టులు చేయించారని వెల్లడిస్తున్నారు. ఎలాగైతేనేం ఏపీ ప్రజలు చాలా రోజుల తరువాత కరోనా విషయంలో ఒక మంచి వార్తను విన్నారు.