టైటిల్ చూసి ఆశ్చర్యపోయారా? అయితే ఫోటో చూడండి.. అది నిజమైన ఫోటోనే. దాంట్లో మాయా లేదు.. మర్మం లేదు.. గ్రాఫిక్స్ అంతకన్నా లేదు. అది నూటికి నూరు పాళ్లు నిజం. ఈ ఘటన దుబాయ్ లో చోటు చేసుకుంది.
అప్పుడే పుట్టిన ఓ శిశువు.. డాక్టర్ సర్జికల్ మాస్క్ ను తీయడానికి ప్రయత్నించిందట. దానికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ ఫోటోను చూసిన నెటిజన్లు మాత్రం ఆ ఫోటోపై తెగ కామెంట్లు చేస్తున్నారు. అవును.. ఇది దేవుడు పంపించిన సంకేతం. త్వరలోనే ఈ మాస్కుల అవసరం ఇక ఉండదు. కరోనా పీడ ఈ ప్రపంచం నుంచి త్వరలోనే విరగడ అవుతుంది.. అని చెప్పడానికి సంకేతమే ఇది.. అంటూ ఎవరికి తోచిన కామెంట్లు చేస్తున్నారు.
ఆ ఫోటోను దుబాయ్ కి చెందిన ఓ డాక్టర్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. మనమంతా త్వరలోనే మాస్కులను తీసేయబోతున్నాం… దానికి ఇదే సంకేతం.. అంటూ ఆయన క్యాప్షన్ జోడించాడు.