వినాయక చవితిని ఒక్క భారతదేశంలోనే కాదు.. ప్రపంచ దేశాల్లో కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఏ దేవుడికీ చేయనట్టుగా.. గణేశ్ చతుర్థి రోజున గణపతి పత్రిమను ప్రతిష్టించి పూజలు చేస్తారు. ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించిన తర్వాత ఆ గణనాథుడిని తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు.
ప్రతి సంవత్సరం ఎంతో గ్రాండ్ గా వినాయక చవితిని అందరూ చేసుకునేవాళ్లు. కానీ.. ఈ సంవత్సరం మాత్రం ఎవరి ఇంట్లో వాళ్లే చేసుకోవాలి. ఎందుకో మీకు కూడా తెలుసు. ఈ మాయదారి కరోనా వచ్చి బతుకులన్నీ ఇలా మారిపోయాయి.
ఇక.. అసలు విషయానికి వద్దాం.. అందరూ గణనాథులను కొనుక్కొని తీసుకొని వస్తే.. ఓ మహిళకు మాత్రం గణనాథుడే తన ఇంటికి వచ్చాడు. కానీ.. పచ్చి మిర్చి రూపంలో.
ఓ మహిళ కూరగాయలు కొనడానికి మార్కెట్ కు వెళ్లింది. అన్ని కూరగాయలు కొనుక్కున్నది. చివరకు పచ్చిమిర్చిని కూడా కొనుక్కున్నది. ఇంటికి వచ్చాక పచ్చిమిర్చిని ఏరుతుంటే అచ్చం గణపతి ఆకారంలో ఉన్న ఓ పచ్చిమిర్చి కనిపించింది.
అసలే వినాయక చవితి.. పచ్చిమిర్చి చూస్తే అచ్చం వినాయకుడిలా ఉంది… దీంతో ఎంతో మురిసిపోయిన ఆ మహిళ… ఆ పచ్చిమిర్చి వినాయకుడిని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
స్వామి దగ్గరికి నువ్వు వెళ్లలేకపోతే… నీ దగ్గరికే ఆయన వస్తాడు. ఒక్కోసారి పచ్చిమిర్చి రూపంలో కూడా రావచ్చు.. అంటూ క్యాప్సన్ పెట్టి.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అంతే.. ఇవాళ అసలే వినాయక చవితి.. ఇక ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఇక.. ఆ మహిళ పెట్టిన పచ్చిమిర్చి వినాయకుడిని చూసిన నెటిజన్లు.. వినాయకుడిని మట్టిరూపంలోనే పూజించాల్సిన పనిలేదు. ఎలాగైనా పూజించవచ్చు. పచ్చిమిర్చి రూపంలో ఉన్నా పూజించొచ్చు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం తెలియలేదు.
When you can’t go to Bappa, he comes home.. sometimes in the guise of a chilly! 😃 🙏 #Ganpati #GaneshChaturthi pic.twitter.com/F3P5i3D1Dx
— Anubha 🌿 (@teatattler) August 21, 2020
It actually looks a lot like Bappa, and just in time for the festival.. 😃 💚 🌿 pic.twitter.com/XiMTL1ZIuK
— Anubha 🌿 (@teatattler) August 21, 2020