బిక్షాటన వెళ్లడానికి మోటార్ బైక్ కొనుక్కున్న వృద్ధ దంపతులు.. వైరల్ ఫోటో!

మామూలుగా భిక్షాటన చేసేవాళ్ళు ఏదైనా తోపుడు బండి లేదా కాలి నడకతో లేదా ఓ చోట కూర్చొని బిక్షాటన చేస్తుంటారు. కానీ ఇక్కడ బిక్షాటన చేసే దంపతులు ఏకంగా బైకు కొనుక్కొని బిక్షాటన చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని ఛింద్వారా జిల్లా కేంద్రంలో 60 ఏళ్లు మీద పడి ఇద్దరు దంపతులు సంతోష్ కుమార్ అతని భార్య మూడు చక్రాల సైకిల్ పై భిక్షాటన చేస్తూ జీవించే వారు.

అతడు కాళ్ళల్లో అంగవైకల్యం ఉండడంతో.. అతడు మూడు చక్రాల సైకిల్ పై కూర్చొని హ్యాండిల్ పట్టుకుంటే అతని భార్య వెనకాల నుంచి పెట్టేది. దీంతో ఆమెకు వయసు మీద పడటంతో పైగా రోడ్లు సరిగా లేకపోవటంతో ఆమె నడుము నొప్పితో ఇబ్బంది పడింది. దీంతో తన భార్య భాదను తట్టుకోలేక.. వాళ్లు అడ్డుకొని కూడబెట్టుకున్న డబ్బులు రూ.90,000 కాగా ఆ డబ్బుతో మోటార్ బైక్ కొనుక్కున్నారు. దీంతో వారు కేవలం అక్కడి ప్రాంతంలోనే కాకుండా దూర ప్రాంతాల్లో కూడా వెళ్లి బిక్షాటన చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.