ఈ ఫోటోకు బెస్ట్ క్యాప్షన్ చెబితే మీకు మహీంద్ర కారు ఫ్రీ.. ఆనంద్ మహీంద్ర బంపర్ ఆఫర్

anand mahindra shared photo of monkey goes viral

ఫోటో చూశారా? ముందు ఫోటోను జాగ్రత్తగా గమనించండి. డిష్ యాంటెనా మీద కోతి దర్జాగా కూర్చున్నది కదా. ఆ ఫోటోకు బెస్ట్ క్యాప్షన్ చెబితే చాలు. మీకు మహీంద్ర కారు ఫ్రీ. అవును.. ఉచితంగా కారును ఇచ్చేస్తారు. ఎవరో కాదు.. ఆ కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రానే మీ ఇంటికి కారు పంపిస్తారు.

anand mahindra shared photo of monkey goes viral
anand mahindra shared photo of monkey goes viral

ఎందుకంటే.. ఈ క్యాప్షన్ కాంపిటిషన్ ను స్టార్ట్ చేసిందే ఆనంద్ మహీంద్ర కాబట్టి. ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో మనందరికీ తెలుసు. ఆయన యాక్టివ్ గా ఉండటమే కాదు.. సోషల్ సర్వీస్ కూడా చేస్తుంటారు. అప్పుడప్పుడు ఇలాంటి ఫోటోలు కూడా షేర్ చేస్తుంటారు.

అయితే.. తాజాగా ఓ ఇంటి మీద ఉన్న డిష్ యాంటినా మీద కూర్చున్న కోతి ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆ ఫోటోకు బెస్ట్ క్యాప్షన్ పెట్టిన వాళ్లకు మహీంద్ర కారును బహుమతిగా అందిస్తానని తెలిపారు. అంతే కాదు.. అక్టోబర్ 11న మధ్యాహ్నం 2 గంటలలోపే దానికి మంచి క్యాప్షన్ పెట్టి.. తన ట్విట్టర్ పోస్ట్ కు రిప్లయి ఇస్తూ మెన్షన్ చేయాలని చెప్పారు.

అయితే.. ఆయన ఇచ్చే మహీంద్ర కారును స్కేల్ మోడల్ కారు. అంటే నిజమైన కారే కానీ.. అది కేవలం ఇంట్లో పెట్టుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది. కానీ.. నడపడానికి కాదు. ఏదైనా కారు కారే కదా. ముందైతే ఓ మంచి క్యాప్షన్ ను ఆలోచించండి.

నెటిజన్లు కూడా ఆ ట్వీట్ ను, ఫోటోను తెగ వైరల్ చేస్తున్నారు. చూద్దాం.. ఆ స్కేల్ కారు ఎవరిని వరిస్తుందో?