Salman Khan: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సల్మాన్ ఖాన్.. ఫొటోస్ వైరల్..?

Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఫోటోలను చూసిన సల్మాన్ ఖాన్ అభిమానులు ఎంత పెద్ద స్టార్ హీరో అయి ఉండి ఇలా ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఏంటి? అది కూడా రహస్యంగా? అంత పెద్ద హీరో ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు అంటే బుద్ధి కావడం లేదు అంటూ ఒక్కొక్కరు ఒక విధంగా కామెంట్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇక ఆ ఫోటోల విషయానికి వస్తే ఎవరో ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసి ఉండాలి లేదా ఏదైనా సినిమాలో స్టిల్స్ కోసం అయినా ఉండాలి అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. సల్మాన్ ఖాన్ ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే ఉన్నాడు. సల్మాన్ ఖాన్ సోనాక్షి దబాంగ్ సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం కబీ ఈద్ కబీ దివాళి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కానుంది.