తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఈ మధ్య కాలంలో అనుకూల పరిస్థితులు లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ఏ పని తలపెట్టినా ఆ పనికి ప్రతిపక్ష పార్టీల నుంచి షాకులు ఎదురవుతున్నాయి. అయితే ప్రస్తుతం కేసీఆర్ తన చిత్తశుద్ధిని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడింది. మంత్రి కేటీఆర్ తాజాగా కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేయడంతో పాటు తెలంగాణ అసెంబ్లీలో ఇందుకు సంబంధించి తీర్మానం కూడా ప్రవేశపెట్టారు.
ఈ తీర్మానం విషయంలో కేటీఆర్ ను అందరూ మెచ్చుకుంటున్నారే తప్ప ఆయనపై ఎవరూ నెగిటివ్ కామెంట్లు చేయడం లేదు. తెలంగాణ కాంగ్రెస్ సైతం పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలనే ప్రతిపాదనకు మద్దతు ఇచ్చింది. అయితే కేసీఆర్ ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మిస్తున్న కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడితే బాగుంటుందని ప్రతిపక్ష పార్టీల నేతల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
సామాన్య ప్రజల నుంచి సైతం ఇదే తరహా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైరల్ అవుతున్న కామెంట్ల విషయంలో కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. గతంలో తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఆ మాటను నిలబెట్టుకోలేదనే సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడిన ఎంతోమందికి కేసీఆర్ ప్రాధాన్యత ఇవ్వలేదని గతంలో కామెంట్లు వినిపించాయి.
కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం కేసీఆర్ కు చాలా సులువు అని అయినప్పటికీ ఆయన ఎందుకు ఆ దిశగా అడుగులు వేయడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం వల్ల ఇతరులను ప్రశ్నించే అవకాశం కూడా వస్తుందని మరి కొందరు సూచిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.