అల్లు అర్జున్ పై దారుణంగా పెట్రోలింగ్ చేస్తున్న నెటిజన్స్.. అసలేం జరిగిందంటే.?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప సినిమా ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా రేంజిలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు సాధించింది. ఈ ఫహాద్ ఫాజిల్, సునీల్ అనసూయ వంటి వారు నెగిటివ్ పాత్రలో కనిపించారు. మైత్రి మూవీ మేకర్స్ మొత్తం శెట్టి మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా కేవలం దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలో కూడా సత్తా చాటింన విషయం తెలిసిందే.

ఇకపోతె పుష్ప సినిమాని మొదట అనుకున్నప్పుడు ఒక బంగ్లా విడుదల చేయాలి అని అనుకున్నప్పటికీ షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత నిడివి ఎక్కువగా ఉండటంతో పాటుగా అంతకంతకూ పెరుగుతూ వెళ్లడంతో ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావించారు. ఇప్పటికే పుష్ప పార్ట్ 1 ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఇక అల్లు అర్జున్ పార్ట్ 1 కంటే పార్ట్ 2లో ఇంకాస్త భిన్నంగ కనిపించబోతున్నారని తెలుస్తోంది. సుకుమార్ డిజైన్ చేసిన సీక్వెల్ లో అల్లు అర్జున్ కాస్త లావుగా కనిపించాల్సి ఉందట.

అందుకే, ఆయన ఇప్పుడు బొద్దుగా తయారయ్యారట. కానీ తాజాగా బన్నీ లుక్స్‌పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా పుష్ప రాజ్ లుక్‌లో ఉన్న బన్నీ ఫొటోను మనవ్ మంగ్లానీ అనే బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ పిక్స్ చూసిన ఒక బాలీవుడ్ నెటిజన్ వడా పావ్ అంటూ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ బన్నీ రోజురోజుకీ బుద్దాలాగా తయారువుతాన్నాడని కామెంట్ చేయగా మరో వ్యక్తి అయితే క్రికెటర్ మలింగా తరహాలో కనిపిస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. అలా మొత్తానికి ఎప్పుడు లేనిది తాజాగా అల్లు అర్జున్ తన లుక్స్ విషయలో సోషల్ మీడియాలో ట్రోల్స్ ని ఎదుర్కొంటున్నాడు.