గోరంట్ల వీడియో విషయంలో టీడీపీ మారదా.. ఎస్పీ మాటలు అర్థం కాలేదా?

గోరంట్ల మాధవ్ వీడియో గురించి ప్రజలు మరిచిపోయినా టీడీపీ నేతలు మాత్రం మరిచిపోయే పరిస్థితులు కనిపించడం లేదు. అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప ఒకరు ఫోన్ లో వీడియో చూస్తుంటే ఆ వీడియోను మరో వ్యక్తి షూట్ చేశారని అందువల్ల వైరల్ అయిన వీడియో ఒరిజినల్ వీడియోనో కాదో తేల్చి చెప్పడం సాధ్యం కాదని వెల్లడించారు. సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసిన వీడియో కాకుండా మొదట అప్ లోడ్ చేసిన వీడియో దొరికితే మాత్రమే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.

పోలీసులు స్పష్టంగా చెప్పినా టీడీపీ నేతలు మాత్రం మారడం లేదు. ఒరిజినల్ వీడియో ఎవరి దగ్గరైనా ఉంటే ఆ వీడియోతో వచ్చి ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు చెప్పినా ఇప్పటివరకు ఒరిజినల్ వీడియోతో పోలీసులను ఎవరూ సంప్రదించలేదు. టీడీపీకి చెందిన పట్టాభిరామ్ ఫోరెన్సిక్ పరీక్షల పేరుతో ఒక నివేదికను తెప్పించి వైరల్ అయిన వీడియో ఒరిజినల్ వీడియో అని ప్రచారం చేస్తుండటం గమనార్హం.

టీడీపీ నేతలు మేమే ఫోరెన్సిక్ పరీక్షలు చేయించామని చెప్పడంతో మీరే గోరంట్ల మాధవ్ కు శిక్ష వేయండని కొందరు నెటిజన్లు వేస్తున్న సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీడీపీ నేతలు ఫోరెన్సిక్ టెస్ట్ కు బదులుగా ఆ వీడియోను షూట్ చేసిన వ్యక్తిని లేదా ఆ వీడియోను ప్రచారంలోకి తెచ్చిన వ్యక్తిని పట్టుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతుండటం గమనార్హం.

కోర్టు సర్టిఫై చేసిన ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చిన నివేదికలు మాత్రమే చెల్లుతాయనే విషయాన్ని టీడీపీ నేతలు ఏ విధంగా మరిచారో అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి కొందరు నెటిజన్లు గతంలో చంద్రబాబుకు సంబంధించి ఒక ఆడియో వైరల్ అయిందని ఆ ఆడియోను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తే బాగుంటుందని కామెంట్లు చేస్తుండటం గమనార్హం.