Singer Sunitha : సింగర్ సునీతని కామెంట్ చేశాడు, అడ్డంగా బుక్కయిపోయాడు.

Singer Sunitha : సింగర్ సునీతకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ వున్న సంగతి తెలిసిందే. డిజిటల్ అధినేత రామ్‌ వీరపనేని తో లేటు వయసు మ్యారేజ్ చేసుకుని, మరింతగా పాపులర్ అయిపోయింది సింగర్ సునీత.

అదేంటో తెలీదు కానీ, సింగర్ సునీత సోషల్ మీడియాలో ఏ వీడియో పోస్ట్ చేసినా, ఏ ఫోటో పోస్ట్ చేసినా పెద్ద వైరల్ అయిపోయి కూర్చుంటోంది. అలాగే తాజాగా సునీత నుంచి వచ్చిన పిక్ ఒకటి నెట్టింట్ వైరల్ అయ్యింది.
మోడ్రన్ లుక్స్‌లో చాలా చాలా ప్రెష్ ఫేస్‌తో కనిపిస్తోంది ఆ ఫోటోలో సింగర్ సునీత. ఆమె వయసు దాదాపు సగానికి సగం తగ్గిపోయిందా అన్నట్లుంది. అందుకే ఆ ఫోటోకి తెగ కామెంట్లూ, షేర్లూ పోటెత్తుతున్నాయ్. అంతా బాగానే వుంది. కానీ, ఓ నెటిజన్ సింగర్ సునీత ఫోటో చూసి లుక్కు చాలా బాగుంది.. అని కామెంట్ చేశాడు.
అందులో వింతేముంది.. అంటారా.? ఆ కామెంట్ కింద ఆయన భార్య రెస్పాండ్ అయ్యింది. అదే ఇప్పుడు నెట్టింట పంచాయితీకి కారణమైంది. ‘లుక్ చాలా బాగుంది..’ అని నెటిజన్ చేసిన కామెంట్ కింద ‘ఓహో అవునా..?’ అని రిప్లై చూసి, ఆ రిప్లై ఎవరిదా..? అని ఆరా తీస్తే, ఆయన భార్య అని తేలిందట.
ఇక అంతే, మిగిలిన నెటిజన్లు సదరు నెటిజన్‌ని ఓ ఆటాడేసుకుంటున్నారు.
ఆయనపై ఫన్నీగా మీమ్స్ కూడా చేసి వదులుతున్నారు. సునీతకి కామెంట్ ఇచ్చి అనవసరంగా భార్యకి దొరికిపోయాడు. బుక్కయిపోయావ్ బ్రదర్ అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇదంతా చూసి, పాపం ఆ నెటజన్ తన ఫేస్‌బుక్ ప్రొఫైల్ లాక్ చేసి, ఆ పోస్ట్ కూడా డిలీట్ చేసి పడేశాడు.
అయ్యో పాపం. మొత్తానికి సింగర్ సునీత ఫోటో ఎంత పని చేసిందో చూశారా.!