Singer Sunitha Daughter: టాలీవుడ్ ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది. ముఖ్యంగా సింగర్ సునీత వాయిస్ కి సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా సునీత ప్లే బ్యాక్ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు.
తన అద్భుత గానంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు సునీత. ఇప్పటికీ ఎన్నో అవార్డులు రివార్డులు సైతం దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో కేవలం పాటలు పాడడం మాత్రమే కాకుండా కొన్ని షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటుంది సునీత. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇకపోతే సింగర్ సునీతకు ఒక కూతురు ఒక కొడుకు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారిద్దరిని చూసే ఉంటారు. వారిలో కూతురు శ్రేయ ఇటీవలే అమెరికా న్యూయార్క్ లోని ప్రాట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుషన్ పూర్తి చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కి సునీత ఫ్యామిలీ అంతా కూడా వెళ్లారు. అక్కడ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న శ్రేయతో కలసి సరదాగా గడిపారు. అక్కడే ఫోటోలు, సెల్ఫీలు కూడా దిగారు.
వీటిని సోషల్ మీడియాలో షేర్ చేసిన సునీత కాస్త ఎమోషనల్ అయ్యింది. మా జీవితంలో ఇదొక మైలురాయి. ఒకప్పుడు స్కెచ్‌బుక్‌లో బొమ్మలు గీస్తూ, వాటికి రంగులు వేసిన నా గారాల పట్టి ఇప్పుడు ప్రాట్ ఇన్‌స్టిట్యూట్ లో ఇల్లుస్ట్రేటర్ గా గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. తన క్రియేటివిటీని ప్రపంచానికి పరిచయం చేసేందుకు రెడీ అయ్యింది. తనను చూస్తుంటే ఒక తల్లిగా నాకెంతో గర్వంగా ఉంది. నువ్వు ఇంత స్ట్రాంగ్ గా, తెలివైన అమ్మాయిగా ఎదుగుతూ ఉంటే నాకెంతో సంతోషంగా ఉంది. నీ సృజనాత్మక శక్తితో మరింత పైకి ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను అని రాసుకొచ్చింది సునీత. అయితే ఇప్పుడు సునీత కూతురి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. శ్రేయ కూడా అమ్మబాటలోనే నడుస్తూ ఒక సినిమాలో పాట కూడా పాడింది. అయితే శ్రేయ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ ఫోటోలను చూసిన అభిమానులు హీరోయిన్ మెటీరియల్, త్వరలో హీరోయిన్ ఎంట్రీ ఉందా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.
