హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న సింగర్ సునీత కుమారుడు.. నిర్మాత ఎవరంటే?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన పిల్లలు వారి వారసులుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది వారసులు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఇకపోతే ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సింగర్ సునీత గురించి అందరికీ సుపరిచితమే. ఈమె తన కుమారుడు ఆకాష్ ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తన కుమారుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి తాజాగా ఈ విషయాన్ని సునీత వెల్లడించారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఈమె తన కుమారుడును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని ప్రతి ఒక్కరూ తనని ఆశీర్వదించాలి అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అయితే ఈయన హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంటే నిర్మాత ఎవరు ఏ బ్యానర్ లో ఆకాష్ సినిమా చేయనున్నారు అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే సునీత గత ఏడాది మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే రామ్ సైతం సునీత కొడుకును ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయాలని భావించారట అయితే మ్యాంగో మీడియా అధినేత రామ్ నిర్మాణంలోనే సునీత కుమారుడు ఆకాష్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవుతుంది.