వామ్మో.. సింగర్ సునీత భర్త ఎన్ని కోట్లకు అధిపతి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా గుర్తింపు పొందిన సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో పాటలు పాడిన సునీత ప్రేక్షకుల మనసులను దోచుకుని సింగర్ గా మంచి గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఎందరో హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా తనకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకుంది. ఇక సునీత వ్యక్తిగత విషయానికి వస్తే ఎన్నో ఏళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్న సునీత ఇటీవల తన ఇద్దరు పిల్లల ప్రోత్సాహంతో రామ్ వీరపనేని అనే ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తిని కుటుంబ సభ్యుల సహకారంతో రెండవ వివాహం చేసుకుంది. వివాహం తర్వాత సునీత తన భర్త పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తోంది.

సునీత రెండవ వివాహం చేసుకున్న రామ్ వీరపనేని అనే వ్యక్తి ప్రముఖ మీడియా వ్యాపారవేత్త అయిన మ్యాంగో డిజిటల్ మీడియాకి అధినేత . రామ్ వీరపనేనికి ప్రముఖ కంపెనీలో కొన్ని వందల కోట్ల రూపాయల విలువచేసే షేర్లు ఉన్నాయి. మ్యాంగో మ్యూజిక్ కి సునీత ఎన్నో పాటలు పాడారు. అలా వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. సునీత కోరిక మేరకు మంచి స్నేహితులుగా ఉన్న వీరు తమ పెద్దల సహకారంతో ఇద్దరూ వివాహం చేసుకొని దంపతులుగా మారారు. యూట్యూబ్లో మంచి బ్రాండ్ ఇమేజ్ ఉన్న మ్యాంగో మ్యూజిక్ కి ఈయన సీఈవో.

అయినప్పటికీ ఈయన సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉండకపోవటం వల్ల ఎక్కువమందికి ఈయన గురించి తెలియదు. తమిళం, హిందీలో బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాల రైట్స్ తీసుకొని యూట్యూబ్ లో రిలీజ్ చేసేవాడు.మ్యాంగో మ్యూజిక్ కి అధిపతి అయిన రామ్ వీరపనేని కొన్ని వందల కోట్ల రూపాయలకు అధిపతి. ఈయన ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన వ్యక్తి కూడా. సునీతని రెండవ వివాహం చేసుకున్న తర్వాత వీరి వివాహం గురించి సోషల్ మీడియాలో చాలా విమర్శలు వినిపించాయి. అయినప్పటికీ సునీత మాత్రం వాటన్నింటిని ఎదుర్కొని తన రెండవ వివాహం గురించి విమర్శలు చేసే వారందరికీ గట్టిగా సమాధానం చెబుతోంది.