ఘనంగా “ట్రిబ్యూట్ టు ఇళయరాజా” ఈవెంట్

హైదరాబాద్ గచ్చిబౌలీ స్టేడియంలో ప్రముఖ సంగీత దర్శకులు “ట్రిబ్యూట్ టు ఇళయరాజా ” మ్యూజికల్ ఈవెంట్ ను నిర్వహించారు. ఆదివారం జరగనున్న ఇళయరాజా లైవ్ కన్సర్ట్ నేపథ్యంలో శనివారం “ట్రిబ్యూట్ టు ఇళయరాజా” ఈవెంట్ ను సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రెడ్ కార్పేట్ ఈవెంట్ కార్యక్రమం కొనసాగింది. ఎన్నో విజయవంతమైన ఈవెంట్స్ చేసిన హైదరాబాద్ టాకీస్ వారి ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఈవెంట్ జరిగింది.

ఇళయరాజ సంగీత దర్శకత్వం వహించిన సినిమాలలోని అలనాటి మధురమైన పాటలను ఆయన ముందే గాయనీ గాయకులు వీనులవిందుగా ఆలపించారు. ఇళయరాజా పాటలు శ్రోతలను ఉర్రూతలూగించాయి. సినీరంగ ప్రముఖులు రాజా సర్ కి అభినందన పేరుతో సంగీత దర్శకుడు ఇళయరాజాకు సన్మానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితుల ఆశీర్వచనాలతో సత్కరించారు. ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, గాయనీగాయకులు ఇళయరాజాను శాలువాతో సన్మానించారు. దర్శకుడు కోదండరామిరెడ్డి, నిర్మాత అశ్వినిదత్, సంగీత దర్శకులు మణిశర్మ, ఆర్.పీ.పట్నాయక్, పాటల రచయిత హరిరామజోగయ్య శాస్త్రి, నిర్మాత సీ.కళ్యాణ్, నటు డు మురళీమోహన్, ప్రముఖనటి మృణాల్ ఠాకూర్, గాయని సునీత, నటుడు రఘుబాబులు ఇళయరాజాను సన్మానించారు. ఇళయరాజ 80ఏళ్లలోకి అడుగుపెడుతున్న సందర్బంగా 80 ఏళ్ల లోగోను ప్రముఖ రచయితా విజయేంద్రప్రసాద్ రిమోట్ తో ఆవిష్కరించారు. కమ్మని సంగీతం..ఎంత విన్నా…వినాలనిపించే సాహిత్యం ఇళయరాజా పాటల్లో ఉంటుందని అని సినీ ప్రమఖులు ఇళయరాజాని కొనియాడారు.