వెబ్ సిరీస్ కోసం రాజమౌళిని సంప్రదించిన నెట్ ఫ్లిక్స్ సంస్థ..?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన వ్యక్తి దర్శకుడు రాజమౌళి. కాగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హీట్ లుగా నిలిచాయి. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా వసూళ్లను సాధించింది. ఇక ఈ సినిమా విడుదల తర్వాత టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎంతో మంది దర్శక నిర్మాతలు, సినీ సెలబ్రిటీలు రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో రాజమౌళి క్రేజ్ మరొక రేంజ్ కీ ఎదిగింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్రాండ్‌తో ఓ సిరీస్‌ను తెరకెక్కించేందుకు ప్రణాళికలు వేస్తోందట ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌. ఇంతకుముందు బాహుబలి: బిఫోర్‌ ది బిగినింగ్‌ అనే పేరుతో నెట్‌ఫ్లిక్స్‌ ఓ వెబ్‌ సిరీస్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

అయితే అతి కొద్ది రోజులకే ఆ ‍ప్రాజెక్టు ముందుకుపోలేదు. తాము ఆశించిన స్థాయిలో చిత్రీకరణ లేదని ఆ ప్రాజెక్ట్‌ను రద్దు చేసింది నెట్‌ఫ్లిక్స్‌. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో మరోసారి రాజమౌళి పేరు వరల్డ్‌ వైడ్‌గా వినిపిస్తోంది. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్‌ రాజమౌళిని ఓ వెబ్‌nసిరీస్‌ కోసం సంప్రదించిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై ఇటు రాజమౌళి టీమ్, అటు నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా స్పందించలేదు. కాగా ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను పూర్తి చేసిన యాజమాని ప్రస్తుతం తన తదుపరి సినిమాను మహేష్ బాబుతో తెరకెక్కించబోతున్నారు.