HariHara Veera Mallu: ఆ విషయంలో సరికొత్త రికార్డు సృష్టించిన హరిహర వీరమల్లు మూవీ.. బాహుబలి కంటే ఎక్కువే!

HariHara Veera Mallu : టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా కోసం దాదాపుగా ఐదేళ్ల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఐదేళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉంటే ఈ పాటికి ఈ సినిమా ఎప్పుడో విడుదల అయి ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ బిజీబిజీగా ఉండటం వల్ల ఈ సినిమా షూటింగ్ చేయడం ఆలస్యం అవుతూ వచ్చింది. ఇటీవల పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన విషయం తెలిసిందే.

ఈ సినిమాను జూన్ 12న విడుదల చేస్తామని మూవీ ప్రకటించినప్పటికీ అనుకోకుండా విఎఫ్ఎక్స్ పనులు అసంపూర్తిగా ఉండడంతో సినిమా విడుదల తేదీని మరోసారి వాయిదా వేశారు మూవీ మేకర్స్. ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ కూడా పూర్తయిందని ట్వీట్ చేసారు మేకర్స్. అయితే ఈ విఎఫ్ఎక్స్ విషయంలో హరిహర వీరమల్లు సరికొత్త రికార్డ్ సెట్ చేసిందట. హరిహర వీరమల్లు సినిమాకు మొత్తం 6000 కు పైగా విఎఫ్ఎక్స్ షాట్స్ వాడారని తెలుస్తోంది. డైరెక్టర్ జ్యోతి కృష్ణ కూడా ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువే ఉందని తెలిపారు.

హరిహర వీరమల్లు సినిమాకు ఏకంగా 6000 విఎఫ్ఎక్స్ షాట్స్ వాడారని తెలియడంతో ఆశ్చర్యపోతున్నారు. కాగా ఇప్పటివరకు ఇండియన్ సినిమాల్లో అత్యధికంగా ప్రభాస్ ఆది పురుష్ సినిమాకు 8000 విఎఫ్ఎక్స్ షాట్స్ వాడారు. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాకు 6000కు పైగా విఎఫ్ఎక్స్ షాట్స్ వాడారు. అలాగే బాహుబలి 1 సినిమాకు 4000 కు పైగా విఎఫ్ఎక్స్ షాట్స్ వాడారు. అలా విఎఫ్ఎక్స్ విషయంలో హరిహర వీరమల్లు సినిమా బాహుబలిని మించిపోయి హరిహర వీరమల్లు సినిమా నిలిచింది.