Nani: టాలీవుడ్ హీరో నాని గురించి మనందరికి తెలిసిందే. నాని ఇటీవల లేటెస్ట్ నటించిన మూవీ హిట్ 3. ఈ సినిమా ఇటీవలే మే 1న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి మంచి రికార్డును సృష్టించింది. కాగా డైరెక్టర్ శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ హిట్ 3 మూవీ మొన్నటి వరకు థియేటర్స్ లో విషయం తెలిసిందే. ఇప్పుడు ఓటీటీ లోకి విడుదల కాబోతోంది. హిట్ 3 సినిమా రేపు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ లో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అంటే మరికొన్ని గంటల్లో ఈ చిత్రాన్ని నెట్‍ఫ్లిక్స్ లో చూసేయవచ్చట. ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ హిట్ 3 మూవీ అందుబాటులోకి రానుంది. అయితే హిట్ 3 చిత్రం కమర్షియల్ గా హిట్ అయినా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ లోకి నాలుగు వారాల్లోనే స్ట్రీమింగ్ కు వస్తోంది. మే 1న థియేటర్లలోకి వచ్చి ఇదే నెలలో ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తోంది. స్ట్రీమింగ్ లో ఈ మూవీకి నేషనల్ వైడ్ లో బాగా క్రేజ్ కనిపించే ఛాన్స్ ఉంది.
నాని చిత్రాలకు ఓటీటీ లో మంచి వ్యూస్ దక్కుతుంటాయి. హిట్ 3 కూడా అది రిపీట్ చేసే అవకాశాలు ఎక్కువే అని చెప్పాలి. థియేటర్లలో సక్సెస్ అయిన ఈ సినిమా ఓటిటిలో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి మరి. నాని విషయానికి వస్తే.. హీరో నాని ఇందులో నటించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇది వల కాలంలో ఉన్నానే నిర్మాతగా అలాగే హీరోగా రెండు రంగాలలోనూ సక్సెస్ఫుల్గా రాణిస్తున్నారు. హీరోగా నాని నటించిన సినిమాలు సక్సెస్ అవుతుండగా నిర్మాతగా కూడా ఆయన మంచి సక్సెస్ లను అందుకుంటున్నారు. యంగ్ హీరోలను సపోర్ట్ చేస్తూ చాలామందికి లైఫ్ ఇస్తున్నారు.