Neo Cov Virus : నియో కోవ్ వైరస్: ఇది సోకితే ఛస్తారు జాగ్రత్త.!

Neo Cov Virus : సరిపోయింది సంబడం. సార్స్ కోవ్ వైరస్ (కోవిడ్ 19 – కరోనా వైరస్) దెబ్బకి ప్రపంచం విలవిల్లాడుతున్నవేళ, అదే కుటుంబానికి చెందిన ఇంకో వైరస్, అత్యంత ప్రమాదకరమైన రీతిలో మానవాళి మీద విరుచుకుపడబోతోందంటూ హెచ్చరిక షురూ అయ్యింది.

ఏ వుహాన్ అయితే, కరోనా వైరస్‌ని ప్రపంచానికి పరిచయం చేసిందో, అదే వుహాన్ ఇప్పుడు ఈ నియో కోవ్ వైరస్ గురించి ప్రపంచాన్ని భయపెడుతుండడం గమనార్హం. చైనా అంటే ఇప్పుడు వైరస్సుల సామ్రాజ్యం.. అని పిలవాలేమో. మానవాళి వినాశనం కోసం చైనా నుంచే ఈ వైరస్సులు పుట్టుకొస్తున్నాయ్.

అయితే, నియో కోవ్ మాత్రం దక్షిణాఫ్రికాలో గుర్తించబడిందట. అక్కడి గబ్బిలాల్లో ప్రస్తుతం ఈ వైరస్ వృద్ధి చెందుతోందట. ఆ గబ్బిలాల నుంచి వైరస్, మనషులకూ సోకే అవకాశం వుందట. అలా వైరస్ గనుక గబ్బిలాల నుంచి మనుషులకు సోకితే.. అంతే సంగతులంటూ వుహాన్ హెచ్చరిస్తోంది.

కోవిడ్ పాపాన్ని తమ మీద ప్రపంచం బలవంతంగా రుద్దిందన్న ఆవేదనతో, చైనా ఇలా నియో కోవ్ పాపాన్ని దక్షిణాఫ్రికా మీద వేస్తోందని అనుకోవాలా.? అన్నట్టు, ఒమిక్రాన్ కూడా దక్షిణాఫ్రికా నుంచే విస్తరించిన విషయాన్ని మర్చిపోకూడదిక్కడ.

ఇక, నియో కోవ్ గనుక వ్యాప్తి చెందడం మొదలైతే, కరోనా వైరస్ కంటే వేగంతో విస్తరించేస్తుందట. సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు ప్రాణాలు కోల్పోతారట. కోవిడ్ వైరస్ లాంటిదే అయినా, వ్యాక్సిన్లేవీ పని చెయ్యవట నియో కోవ్ వైరస్ మీద. అసలు ఆ వైరస్ వుందో లేదో తెలియదుగానీ, వైరస్ భయాలతో మాత్రం మనుషుల్ని చంపేస్తున్నారన్నమాట.