2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన టీడీపీ నాయకులు ఇంకా ఆ భాద నుండి తెలుకోలేదు. చంద్రబాబు నాయుడు మాత్రం ఇంకా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేతకాదని ప్రూవ్ చేయడానికి చంద్రబాబు నాయుడు మొదట నుండి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో లోపాలు ఉన్నాయని ప్రజల చేత కూడా చెప్పించడానికి చంద్రబాబు నాయుడు స్థానిక ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు.
వైసీపీ వైఫల్యమే టీడీపీకి బలమా!!
టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు స్థానిక ఎన్నికల కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, అదే అభిప్రాయం ఇప్పుడు స్థానిక ఎన్నికల ఫలితాల ద్వారా వెల్లడి అవుతుందని బాబు భావిస్తున్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడస్తుంది. ఈ పదిహేను నెలల్లో జగన్ తీసుకున్న నిర్ణయాలతో ప్రభుత్వం పై ప్రజలలో అసంతృప్తి బాగా పెరిగిందన్న అంచనాలో టీడీపీ ఉంది. మరోవైపు కరోనా మహమ్మారితో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీలో కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమయిందని ఇప్పటికే టీడీపీ ఆరోపిస్తూ వస్తుంది. జగన్ చేతకాని తనంవల్లనే కరోనా విషయంలో రాష్ట్రం దేశంలో అగ్రస్థానానికి చేరుకుందని కూడా ఆరోపిస్తుంది. అలాగే జగన్ తీసుకున్న మూడు రాజధానుల విషయం పట్ల కూడా జనాలు ఆగ్రహంతో ఉన్నారని, అలాగే ప్రభుత్వ అనుభవ లోపం వల్ల జగన్ తీసుకున్న దాదాపు అన్ని నిర్ణయాలు కోర్ట్ ల దగ్గర నిలిచిపోయాయని, ఇదే విషయంలో ప్రజలు కూడా అసంతృప్తిలో ఉన్నారని, ఆ అసంతృప్తి ఓట్ల రూపంలో కూడా బయటపడుతుందని టీడీపీ నాయకులు భావిస్తున్నారు.
స్థానిక ఎన్నికలు వైసీపీ పనితనాన్ని నిర్ణయిస్తాయా!!
ప్రజలకు వైసీపీ పట్ల ఉన్న అసంతృప్తి స్థానిక ఎన్నికల ఫలితాలు చూపిస్తాయని టీడీపీ నాయకులు చూపిస్తున్నారు. అయితే ఈ వాదనను వైసీపీ నాయకులు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. టీడీపీ నాయకులు చేస్తున్న వాదనలో చాలా వరకు నిజం ఉంది. వైసీపీ తీసుకున్న చాలా నిర్ణయాలు కోర్ట్ లో నిలిచిపోయాయి, అలాగే ప్రజల అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు కూడా చాలా తక్కువ, కరోనా విషయంలో కూడా తగిన చర్యలు తీసుకోలేదని చాలా వరకు ప్రజలు భావిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వైసీపీ నాయకులు స్థానిక ఎన్నికలకు ఎలా సిద్ధమవుతారో వేచి చూడాలి. ఈ స్థానిక ఎన్నికల ఫలితాలే ఇప్పటి వరకు జగన్ పాలనకు సంకేతం కానుంది కాబట్టి స్థానిక ఎన్నికల్లో వైసీపీ వ్యూహాలు ఏంటో వేచి చూడాలి.