ఏఎన్నార్ సినిమా వల్ల ఎస్పీ బాలుపై నెగిటివ్ కామెంట్లు.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది సింగర్లు మాత్రమే హీరోల వాయిస్ కు అనుగుణంగా పాటలు పాడతారనే సంగతి తెలిసిందే. అలా పాటలు పాడే అతికొద్ది మంది సింగర్లలో ఎస్పీ బాలు ఒకరు. ఎస్పీ బాలు తొలిసారి ఇద్దరు అమ్మాయిలు అనే సినిమాకు ఏఎన్నార్ కు ప్లే బ్యాక్ పాడారు. కన్నడంలో హిట్టైన సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. ఏఎన్నార్ తో పాటు శోభన్ బాబు ఈ సినిమాలో మరో హీరోగా నటించారు.

పుట్టన్న కణగల్ ఈ సినిమాకు డైరెక్టర్ కాగా వాణిశ్రీ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించారు. ఈ సినిమాలో నా హృదయపు కోవెలలో అనే సాంగ్ ఉండగా కె.వి.మహదేవన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా దాశరథి పాటను రాశారు. ఘంటశాల పాడాల్సిన ఈ పాటను కొన్ని కారణాల వల్ల ఎస్పీ బాలుతో పాడించటం జరిగింది. ఘంటసాల హెల్త్ ప్రాబ్లమ్ తో బాధ పడుతుండటంతో ఈ పాటను ఎస్పీ బాలుతో పాడించారు.

ఘంటశాలకు ఆరోగ్య సమస్యలు తగ్గిన తర్వాత ఆయనతో మళ్లీ ఈ పాటను పాడించాలని అనుకున్నా ఎస్పీ బాలు పాడిన పాటతోనే షూటింగ్ ను పూర్తి చేశారు. పాట షూట్ పూర్తైన తర్వాత కూడా ఘంటశాలతో పాట పాడించాలని అనుకుంటే అలా చేయడం సాధ్యం కాలేదు. ఆ తర్వాత సినిమాలో కూడా ఎస్పీ బాలు పాడిన పాటను అలానే ఉంచేశారు. అయితే ఎస్పీ బాలు మొదట ట్రాక్ కోసం అని పాటను సాధారణంగా పాడారు.

తాను పాడిన పాటను సినిమాలో ఉంచుతారని ఎస్పీ బాలు సైతం అనుకోలేదు. తను పాడిన పాటను సినిమాలో ఉంచుతారని తెలిస్తే ఎస్పీ బాలు ఏఎన్నార్ లా పాడటానికి ప్రయత్నించేవారు. అయితే ఎస్పీ బాలు పాడిన పాట ఏఎన్నార్ వాయిస్ కు సూట్ కాలేదని నెటిజన్లు కామెంట్లు చేశారు. ఎస్పీ బాలు ఊహించని స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారు. కరోనా బారిన పడి కోలుకున్నా ఆరోగ్య సమస్యల వల్ల బాలు మృతి చెందారనే సంగతి తెలిసిందే.