ఇండస్ట్రీ టాక్ : యూఎస్ లో “NBK107” బిజినెస్ ఎంతకి అంటే.!

ఇప్పుడు టాలీవుడ్ సినిమా దగ్గర భారీ హైప్ ఉన్న సీనియర్ స్టార్ హీరోల చిత్రాల్లో నందమూర్తి నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం కూడా ఒకటి. తన కెరీర్ లో 107వ సినిమాగా ఇది తెరకెక్కుతుంది.

ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ లాంటి భారీ తారాగణం నటిస్తున్న సినిమాని దర్శకుడు గోపీచంద్ మలినేని చాలా మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈరోజు సినిమా అవైటెడ్ టైటిల్ రిలీజ్ అవుతుండగా ఈ సినిమా బిజినెస్ కి సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది.

ఈ చిత్రం ఓవర్సీస్ లో కీలక ,మార్కెట్ అయినటువంటి యూఎస్ లో మంచి బిజినెస్ ని జరిపింది అట. మరి ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం అయితే ఈ చిత్రంని ఫార్స్ ఫిల్మ్స్ వారు మూడున్నర కోట్లు పెట్టి కొనుగోలు చేశారట.

దీనితో బాలయ్య కెరీర్ లో ఇది మరో అత్యధికం డీల్ అన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంకా ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతిలో రిలీజ్ చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నారు.