Nayanthara: నీ ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవు.. ఆసక్తికర పోస్ట్ చేసిన నయనతార!

Nayanatara: కోలీవుడ్ సెలబ్రిటీ జంట నయనతార విఘ్నేశ్‌ శివన్‌ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నయనతార తెలుగుతోపాటు కోలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. అంతేకాకుండా అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ లలో టాప్ జాబితాలో ఉంది ఈ ముద్దుగుమ్మ. అలాగే విగ్నేష్ శివన్ కూడా వరుసగా సినిమాలను తెరకెక్కిస్తూ నిర్మిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే ఈ జంట కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన విషయాలను పంచుకుంటూనే ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ జంట మూడవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా నయనతార పంచుకున్న ఫోటోస్ సోషల్ మీడియా లో వైరల్‌ గా మారాయి. ఇటీవల విహార యాత్రకు సంబంధించిన క్యూట్‌ ఫోటోలను షేర్‌ చేసిన నయన్‌ స్వచ్ఛమైన ప్రేమను పంచుతున్నందుకు విఘ్నేశ్‌ శివన్ కు ధన్యవాదాలు తెలిపారు.

ఒకరిపై ఒకరు ఇంతగా ఎలా ప్రేమ చూపుతారనేది ఎప్పటికీ సమాధానం దొరకని ఆశ్చర్యపరిచే విషయమే.. కానీ.. నీ రూపంలో దానికి నాకు సమాధానం దొరికింది. నీ ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవు. నా మనసు కోరుకునే ప్రేమవు నువ్వు. ఇద్దరిగా ప్రారంభమైన మన ప్రయాణం నలుగురుగా మారింది. ఇంతకు మించి కోరుకోవడానికి ఏముంది.. స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందో నువ్వు నాకు చూపించావు. నా జీవిత భాగ స్వామికి పెళ్లిరోజు శుభాకాంక్షలు అంటూ కవితాత్మకంగా శుభాకాంక్షలు తెలిపారు నయన్. అలాగే కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోస్ ని చూసిన అభిమానులు ఈ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.