ఫుడ్ కోసం ఎదురుచూస్తున్న నయనతార.. ఫోటోను అభిమానులతో పంచుకున్న విగ్నేష్?

నయనతార విగ్నేష్ పెళ్లి అయిన తర్వాత దైవ దర్శనాలు చేసుకుని థాయిలాండ్ హనీమూన్ ట్రిప్ వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ జంట థాయిలాండ్ లో ఎంతో ఎంజాయ్ చేస్తూ వీరి హనీమూన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరికి సంబంధించిన ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. థాయిలాండ్ హనీమూన్ వెకేషన్ లో ఉన్నటువంటి నయనతార విగ్నేష్ ఎప్పటికప్పుడు వారి వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.

తాజాగా నయనతార ఫోటోని విగ్నేష్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక ఈ ఫోటోని షేర్ చేసిన విగ్నేష్ నయనతార ఫుడ్ కోసం ఎదురు చూస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోని ఈ ఫోటో క్షణాలలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోలో నయనతార ఎంతో ట్రెండీ లుక్ లో ఉన్నారు. మెడలో పసుపు తాడు చేతికి పసుపు దారం ఉండటంతో నయనతారలో కొత్త పెళ్ళికూతురు కల కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఈ క్రమంలోనే ఈ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారడమే కాకుండా పెద్ద ఎత్తున లైక్స్ కామెంట్స్ కూడా దక్కించుకుంది.

ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే ఈమె విగ్నేష్ దర్శకత్వంలో నటించిన కాత్తు వాకుల రెండు కాదల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తమిళంలో మంచి విజయమే అయినప్పటికీ తెలుగులో పెద్దగా ఆదరణ పొందలేదు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార చెల్లెలి పాత్రలో నటిస్తున్నారు. అదేవిధంగా అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న జవాన్ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు.