గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో వ్యవహరిస్తున్నట్టు వంటి ప్రేమపక్షులు నయనతార విగ్నేష్ ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. నేడు ఉదయం వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా అతిథులు కుటుంబసభ్యుల సమక్షంలో జరిగింది. అయితే వీరి వివాహ వీడియోలు ఫోటోలు బయటకు రాకుండా ఎంతో జాగ్రత్తలు తీసుకున్నారు.ఇకపోతే వివాహం జరిగిన తర్వాత మధ్యాహ్నానికి తమ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తామని విగ్నేష్ మీడియా ముందు తెలియజేశారు.
ఈ క్రమంలోనే నయనతారతో కలిసి ఉన్నటువంటి పెళ్లి ఫోటోలు విగ్నేష్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా పెళ్లి దుస్తులలో ఉన్నటువంటి ఈ ఫోటోను షేర్ చేస్తూ 10 మార్కులు ఇవ్వాల్సి వస్తే నయనతారకు 9 నాకి ఒకటి ఇవ్వవచ్చు. భగవంతుడి దయతో… ఈ విశ్వం, మా తల్లిదండ్రులు, స్నేహితుల ఆశీర్వాదాలతో… పెళ్లి చేసుకున్నాం” అని విఘ్నేష్ శివన్ పేర్కొన్నారు. జస్ట్ మ్యారీడ్ హ్యాష్ ట్యాగ్ జోడించారు.ఇకపోతే వీరి పెళ్లికి పలువురు సెలబ్రిటీలు హాజరైనట్టు తెలుస్తోంది.
నేడు మహాబలిపురంలో కేవలం కొంత మంది సమక్షంలో, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు అయితే 11వ తేదీ చెన్నైలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సుమారు లక్షల్లో తరలి వస్తారని సమాచారం. నయనతార విగ్నేష్ వీరి పెళ్లి రిసెప్షన్ కి పెద్ద ఎత్తున అందరిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎరుపు రంగు చీరలో నయనతార గోధుమరంగు శర్వాణి లో విగ్నేష్ వధూవరులుగా చూడటానికి ఎంతో ముచ్చటగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.