సోషల్ మీడియా వేదికగా వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో తో ఆహ్వానం పలికిన నయన్ విగ్నేష్!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. గత కొంతకాలం నుంచి ప్రేమలో విహరించిన ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు.ఈ క్రమంలోని వీరి వివాహం మహాబలిపురంలో ఎంతో ఘనంగా జరుగుతుందని ఇప్పటికే వీరి వివాహానికి సంబంధించిన ఏర్పాట్లన్ని కూడా పూర్తి అయ్యాయని తెలుస్తోంది. జూన్ 9వ తేదీ నయనతార విగ్నేష్ మూడుముళ్ల బంధంతో ఒకటి కానున్నారు.

ఇకపోతే వీరి పెళ్లికి కేవలం ఇరు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారని వెల్లడించారు. ఇక ప్రస్తుతం విగ్నేష్ నయనతార పెళ్లికి సంబంధించిన ఒక యానిమేటెడ్ ఇన్విటేషన్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో తమిళ సాంప్రదాయ దుస్తులలో వరుడు వధువు ఇద్దరు ముస్తాబయ్యి నడిచి వెళ్తున్నట్టుగా ఉంది. ఇక ఈ వీడియోలో నయనతార విగ్నేష్ తల్లిదండ్రుల పేర్లతో పాటు వీరి వివాహం ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది అనే విషయాల గురించి తెలియ చేయడమే కాకుండా పెళ్లి వేదిక గురించి కూడా తెలియజేశారు.

ఈ విధంగా నయనతార విగ్నేష్ తమ పెళ్లికి సంబంధించిన ఈ యానిమేటెడ్ వెడ్డింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టడంతో ఎంతోమంది ఈ వీడియో చూసి ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే వీరి పెళ్లికి కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉండటంతో ఇప్పటికే మహాబలిపురంలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయ్యాయని, మహాబలిపురం మొత్తం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారని తెలుస్తోంది. ఇకపోతే ఈ జంట వీరి పెళ్లికి ఒకరికొకరు ఎంతో ఖరీదైన బహుమతులను గిఫ్ట్ గా ఇచ్చుకున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఏది ఏమైనా ఇన్ని రోజుల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఒకటి కాబోతున్నారని తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.