Pushpha Movie: పుష్ప శ్రీవల్లి పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన నరేంద్ర మోడీ… వీడియో వైరల్!

Pushpha Movie: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్ గా పాన్ ఇండియా స్థాయిలో గత ఏడాది డిసెంబర్ 17 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా పుష్ప గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు. మొదటి సినిమాతోనే అల్లుఅర్జున్ ఈ రేంజ్ లో గుర్తింపు పొందారంటే ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ముఖ్యంగా ఈ సినిమాలో ప్రతి ఒక్క పాట శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. దేవి శ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో ప్రతి ఒక్కరిని మ్యాజిక్ చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే కేవలం దక్షిణాది రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఉత్తరాది రాష్ట్రాలలో కూడా పుష్ప సినిమాలో పాటలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇలా ఈ సినిమాలో శ్రీవల్లి అనే పాటకు మరింత డిమాండ్ ఏర్పడిందని చెప్పాలి.ఎవరు చూసిన ఈ పాటకు కాలు కదుపుతూ డాన్స్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే నిన్న డేవిడ్ వార్నర్ అద్భుతమైన స్టెప్పులు వేయగా నేడు తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా ఈ స్టెప్పులకు కాలు కదిపారు.అయితే ఈ పాటకు నిజంగానే ప్రధానమంత్రి డాన్స్ వేశారు అనుకుంటే పొరపాటే..క్రియేటివ్ మైండ్స్ లో కార్టూన్ రూపంలో మోడీ స్టెప్పులేసినట్టు క్రియేట్ చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఈ పాటకు డాన్స్ చేయించారు. కేవలం డాన్స్ మాత్రమే కాకుండా అల్లు అర్జున్ తరహాలో తగ్గేదే లే అనే మూమెంట్ కూడా చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.