Narendra Modi: నరేంద్ర మోదీతో వాహ్ అనిపించుకున్న చిన్నారి.. వైరల్ వీడియో!

Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తాజాగా ఓ చిన్నారి ఫిదా చేసింది. ఇంతకు అసలేం జరిగిందంటే.. గుజరాత్ కు చెందిన జిల్లా పంచాయతీ ప్రెసిడెంట్ లు, సభ్యులతో నరేంద్ర మోదీ నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇక ఆ సమయంలో ఒక కుటుంబం నరేంద్ర మోదీని కలిసింది. ఇక ఆ ఫ్యామిలీ లో ఉన్న ఒక చిన్నారి నరేంద్ర మోదీకి గిఫ్ట్ ఇస్తూ స్తోత్రాన్ని వినిపించింది.

‘అయిగిరి నందిని’ అనే స్తోత్రాన్ని ఆ చిన్నారి గుక్కతిప్పుకోకుండా ఒక నిమిషం పాటు పాడి వినిపించింది. ఇక అది విన్న నరేంద్ర మోదీ చిన్నారి తలపై చేతులు పెట్టి వాహ్ అంటూ అభినందించాడు. అంతేకాకుండా ఆ చిన్నారిని ఆశీర్వదించాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.