చినబాబు పార్టీ పగ్గాలు అందుకున్నట్టేనా!

nara lokesh telugu rajyam

టీడీపీని కొంతకాలం అన్న నందమూరితారకరామారావు నడిపించారు, ఆ తరువాత నుండి దాదాపు ఒక పాతిక సంవత్సరాలు నారా చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారు. ఎన్టీఆర్ నాయకత్వంలోను, చంద్రబాబు నాయకత్వంలోనూ పార్టీ చాలా సంవత్సరాలు విజయపథంలో నడిచింది. కానీ ఇప్పుడు టీడీపీ వైసీపీ దెబ్బకు ఎప్పుడు లేని విధంగా పతనావస్థకు చేరుకుంది. అక్కడ నుండి తిరిగిపుంజుకోవడానికి టీడీపీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నూతన యువ నాయకత్వాన్ని కోరుకుంటుందని తెలుసుకున్న చంద్రబాబు తన రాజకీయ వారసత్వాన్ని లోకేష్ కు ఇచ్చేశారని సమాచారం.

పార్టీ పగ్గాలు లోకేష్ పుచ్చుకున్నారుగా!

దేశంలో కరోనా రాకపోతే ఇంకా బాబు ఊరూరా పట్టుకుని తిరిగేవారే. ఇపుడు మాత్రం ఆరేడు నెలలుగా ఆయన తెర వెనకే ఉంటున్నారు. ఈ మధ్యలోనే అనేక పరిణామాలు కూడా జరిగిపోయాయి. పార్టీని లోకేష్ చేతిలో పెట్టాలన్న బాబు తాపత్రయానికి తగినట్లుగానే తమ్ముళ్ళు మీరు రాకపోతే పోయె కనీసం చినబాబునైనా పంపించండి. ఆయన్ని ఏపీలో ఉంచండి అంటూ మొరపెట్టుకున్నారు. సరిగ్గా ఇదే బాబు కూడా కోరుకున్నారు. దాంతో తాను వెనక ఉండి కుమారుడిని ముందుకు నెట్టారు. ఈ పరిణామంతో లోకేష్ బ్యాచ్ ముందుకు వచ్చేసినట్లు అయింది. పార్టీకి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. ఆయనే సైడ్ అయిపోయి కొడుకుకి దారి ఇచ్చేశాక మిగిలిన వారు సైతం సరెండర్ కాక తప్పదు. బాబు తో పాటే వృధ్ధ తరం నాయకులు ఇక రెస్ట్ తీసుకుంటారన్నమాట. అలాగే రాష్ట్ర కమిటీలు, దాని అధ్యక్షుడు కూడా లోకేష్ బాటలోనే సాగాలి. అలా చినబాబు నాయకత్వంలోనే పార్టీ ముందుకు సాగుతుంది అన్న మాట.

గతంలో నాయకత్వ లక్షణాలు ఇప్పుడు లోకేష్ లో ఉన్నాయా!

గతంలో లోకేష్ నాయకత్వాన్ని సొంత టీడీపీ నాయకులే వద్దని చెప్పారు. ఎందుకంటే ఆయనకు మాట్లాడటమే సరిగ్గా రాదు పార్టీని ఎలా నడిపిస్తారని టీడీపీ నాయకులే బాబుతో చెప్పారు. అలాగే ఆయన పార్టీని నడిపించేంత నాయకత్వ లక్షణాలు కూడా లేవని గతంలో ఎంతోమంది టీడీపీ నాయకులే మీడియా ముందు చెప్పారు. మరి అప్పుడు లేని నాయకత్వ లక్షణాలు ఇప్పుడు ఎక్కడి నుండి వస్తాయో తెలియదు లోకేష్ కు పార్టీ పగ్గాలు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. దీనికి సంకేతంగా తాజాగా తెలుగు మహిళా విభాగం ప్రతినిధుల ప్రమాణ స్వీకారానికి చినబాబే పౌరోహిత్యం చేశారు. తన సారధ్యంలోనే ఈ కధ మొత్తం రక్తి కట్టించారు. నిజానికి ఇలాంటి కార్యక్రమాలకు చంద్రబాబు హాజరు తప్పనిసరి. కానీ ఈసారి చినబాబే అధ్యక్ష స్థానం అలంకరించేశారు. అమరావతి ఉద్యమాలపైన, పార్టీ నాయకులతోను లోకేషే చర్చలు జరుపుతున్నారు. మరి లోకేష్ అధ్యక్షతన టీడీపీ ఎలా పరుగులు టిస్తుందో వేచి చూడాలి.