టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కాస్త దూకుడు ప్రదర్శిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఆయన ఎక్కువగా ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు. వైసీపీపై నారా లోకేశ్ ఎక్కువగా ట్విట్టర్ లో విమర్శలు గుప్పిస్తుంటారు.
తాజాగా… చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామాలపై వైసీపీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరుపై భగ్గుమన్నారు లోకేశ్. అధికార మదం కళ్లకెక్కిన వైసీపీ పాలకులకు ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా పోయిందని మండిపడ్డారు.
అనంతపురం జిల్లాలోని తాడిమర్రి మండలంలోని మర్రిమేకులపల్లి గ్రామాన్ని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కోసం ముంపు గ్రామంగా ప్రకటించారు. అయితే.. ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండగానే.. జేసీబీలో ఆ ఊళ్లోని ఇళ్లను పడగొడుతున్నారని.. ప్రజల ప్రాణాలంటే కూడా వైసీపీ పాలకులకు లెక్కలేకుండా పోయిందని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల మూడేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడని లోకేశ్ ట్వీట్ చేశారు.
పరిహారం చెల్లించకుండానే.. ఇళ్లను కూల్చివేయడం దారుణమైతే.. మనుషులు ఉండగానే ఇళ్లను కూల్చేయడాన్ని ఏమనాలి? బతికుండగానే మనుషులను సమాధి చేయాలన్న క్రూరమైన ఆలోచనలు మీకెలా వస్తాయి.. ఏమాత్రం మానవత్వం ఉన్నా వెంటనే కూల్చివేతలను ఆపేయండి.. అంటూ నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.
అధికార మదం కళ్ళకెక్కిన వైసీపీ పాలకులకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయింది. అనంతపురం జిల్లా, తాడిమర్రి మండలంలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన మర్రిమేకులపల్లిలో ఓ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండగానే జేసీబీతో ఇల్లు పడగొట్టిన రాక్షసత్వం ఇది.(1/2) pic.twitter.com/HhZICqABAt
— Lokesh Nara (@naralokesh) October 30, 2020
ఘటనలో గాయపడ్డ మూడేళ్ళ చిన్నారి చావుబతుకుల్లో ఉన్నాడు. పరిహారం చెల్లించకుండానే ఇళ్లను కూల్చివేయడం దారుణమైతే…మనుషులు ఉండగానే ఇళ్ళను కూల్చడాన్ని ఏమనాలి? బతికుండగానే మనుషుల్ని సమాధి చేయాలన్న క్రూరమైన ఆలోచనలు మీకెలా వస్తున్నాయి? ఏ మాత్రం మానవత్వం ఉన్నా కూల్చివేతలని తక్షణం ఆపండి(2/2)
— Lokesh Nara (@naralokesh) October 30, 2020