టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తోందన్నారు. ఈసందర్భంగా ఆయన ట్వీట్ చేశారు.
అమరావతి రైతుల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన గత కొన్ని రోజుల నుంచి ఆయన ట్విట్టర్ లో విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా.. అమరావతి ఉద్యమం చేస్తున్న మహిళా రైతులపై దాడి చేసి పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
అన్నంపెట్టే భూములు ఇచ్చిన అమరావతి రైతులకు అన్యాయం చేశారు. అన్నదాతల త్యాగాల పునాదిని సమాధి చేసే కుట్రలు పన్నారు. ఐదుకోట్ల ఆంధ్రుల రాజధాని కల సాకారం చేసిన వారి రక్తం కళ్ల జూస్తున్నారు. మహిళలపై దుశ్శాసనపర్వం సాగిస్తున్న దుష్టపాలనకు చరమగీతం పాడే మహోద్యమం ఇది. నీ లాఠీలు, తుపాకులు, నిర్బంధాలను ఎదిరించి మరీ వీరవనితలు నీ పతనాన్ని శాసిస్తారు.. ప్రజారాజధానిని శాశ్వతం చేస్తారు.. అంటూ లోకేశ్ తీవ్రస్థాయిలో ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. రాజధాని ఉద్యమం చేస్తున్న మహిళా రైతులను పోలీసులు దౌర్జన్యంగా అరెస్ట్ చేసిన వీడియోను కూడా లోకేశ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
https://twitter.com/naralokesh/status/1322483523748462593
మహిళలపై దుశ్శాసనపర్వం సాగిస్తున్న దుష్టపాలనకు చరమగీతం పాడే మహోద్యమం ఇది. నీ లాఠీలు, తుపాకులు, నిర్బంధాలను ఎదిరించి మరీ వీరవనితలు నీ పతనాన్ని శాసిస్తారు. ప్రజారాజధానిని శాశ్వతం చేస్తారు. (2/2)
— Lokesh Nara (@naralokesh) October 31, 2020