Lokesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ బుక్ అంటేనే వైసీపీ నేతలకు వెన్నులో వణుకు పుడుతున్నట్టు ఈయన మాట్లాడారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో రెడ్ బుక్ లో తన పార్టీ వారిని ఎవరైతే హింసించారో వారి పేర్లు రెడ్ బుక్ లో నమోదు చేశారు. అనంతరం మా పార్టీ అధికారంలోకి వస్తే ఎవరైతే మమ్మల్ని హింసించారో వారికి తప్పనిసరిగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ గతంలోనే లోకేష్ హెచ్చరించారు.
ఇలా లోకేష్ హెచ్చరించిన విధంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసిపి నాయకుల పై చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. అయితే కడపలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో భాగంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. గత వైసీపీ విధ్వంస పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, దేశానికే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని విమర్శించారు. 2024లో మాస్ విక్టరీ సాధించామని… 94 శాతం స్ట్రైక్ రేట్‌తో చరిత్రను తిరగరాశామని తెలిపారు. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మాస్ దెబ్బ అంటూ కార్యకర్తలను ఉర్రూతలూగించారు.
టీడీపీ జెండా పీకేస్తామని, పార్టీని అడ్రస్ లేకుండా చేస్తాము అంటూ ఎన్నో వార్నింగ్ ఇచ్చారు అయితే చివరికి వారి పార్టీని నామరూపాలు లేకుండా పోయిందని తెలిపారు. రెడ్ బుక్ పేరు వింటేనే ఒకడికి గుండెపోటు వచ్చింది. మరొకరు బాత్రూంలో కాలు జారి పడి చెయ్యి విరగొట్టుకున్నాడు.ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు… అర్థమైందా రాజా, అర్థమైందా రాజా అంటూ లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం తమ ఇంటి తలుపు ఎప్పటికీ తెరిచే ఉంటుందని లోకేష్ తెలిపారు. గ్రామస్థాయిలో సమస్య ఉంటే మండల స్థాయిలో పార్టీని కలిసి సమస్య పరిష్కరించుకోవాలి మండల స్థాయిలో సమస్య ఉంటే నియోజకవర్గం వెళ్లి ఆ సమస్య పరిష్కరించుకోవాలని లోకేష్ ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచనలు చేశారు.