టీడీపీ, వైసీపీల మధ్య రోజురోజుకూ వైరాలు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అని ఢీ అంటున్నారు. టీడీపీ.. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ కుంభకోణాలే అని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే.. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి చేసేందేంటి.. అన్నీ అక్రమాలే అంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ప్రస్తుతం దూకుడు మీదున్నాడు. అస్సలు ఆగడం లేదు. 2019 లో టీడీపీ ఓడిపోయిన తర్వాత కొన్ని రోజులు మౌనంగా ఉన్న లోకేశ్ తాజాగా దూకుడు పెంచారు. ట్విట్టర్ లో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.
తాజాగా వాలంటీర్ వండర్స్ పేరుతో ఓ వీడియోను ట్విట్టర్ లో వదిలారు నారా లోకేశ్. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ వచ్చి అక్టోబర్ 2కు సంవత్సరం అయిన నేపథ్యంలో సీఎం జగన్ ఏపీ ప్రజలందరూ చప్పట్లు కొట్టి వాళ్లను ప్రోత్సహించాలని చెప్పారు కదా. దాన్ని ఎద్దేవా చేస్తూ వీడియో పెట్టారు లోకేశ్.
వాలంటీర్లు చేస్తున్న అక్రమాలతో ఉన్న వీడియో అది. దాన్ని గ్రాఫిక్స్ లో మార్పులు చేసి.. ఒక్కో వాలంటీర్ చేసిన తప్పుకు జగన్ చప్పట్లు కొడుతున్నట్టుగా తీర్చిదిద్దారు.
ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ వీడియోపై కొన్ని పాజిటివ్ కామెంట్స్ రాగా.. ఎక్కువ నెగెటివ్ కామెంట్సే వచ్చాయి. ఎవరో ఇద్దరు ముగ్గురు వాలంటీర్లు తప్పు చేస్తే.. ఆ వ్యవస్థ మొత్తం తప్పు అన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
వాలంటీర్ వండర్స్ pic.twitter.com/zvcwnOafhc
— Lokesh Nara (@naralokesh) October 3, 2020