ఏపీలోని విశాలో దళిత బాలికపై జరిగిన అత్యాచారం ఘటన ప్రస్తుతం ఏపీలో వివాదస్పదంగా మారింది. ఈ ఘటనపై విచారణను వేగవంతం చేయాలని.. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు.
ట్విట్టర్ లో స్పందించిన లోకేశ్.. బాలికకు, ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ లో మాట్లాడి భరోసా ఇచ్చినట్టు తెలిపారు. బాధితులతో లోకేశ్ ఫోన్ లో మాట్లాడిన వీడియోను కూడా లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
విశాఖపట్నంలోని గాజువాక వాంబే కాలనీలో మైనర్ బాలికపై పాస్టర్ అత్యాచారయత్నం చేశాడని.. ఈ ఘటన రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల తీవ్రతను తెలియజేస్తోందని లోకేశ్ ట్వీట్ చేశారు.
బాధిత బాలిక తండ్రి, మేనత్తతో ఫోన్ లో మాట్లాడాను. బాలికకు అన్నగా అండగా ఉంటానని మాట ఇచ్చాను. బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తికి కఠిన శిక్ష పడేలా వారి కుటుంబం చేస్తున్న పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని లోకేశ్ చెప్పారు.
వాంబే కాలనీకి చెందిన బాలిక తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో బాలిక.. తన మేనత్త దగ్గర ఉంటోంది. అయితే.. అదే ప్రాంతానికి చెందిన పాస్టర్.. తనపై అత్యాచారయత్నం చేయబోయాడు. దీనిపై బాధితులు పోరాటం చేస్తున్నారు. నిందితుడికి శిక్ష పడాలంటూ వాళ్లంతా పోరాటం చేస్తున్నారు. వాళ్ల పోరాటానికి లోకేశ్ మద్దతు ప్రకటించారు.
విశాఖపట్నం, గాజువాక వాంబే కాలనీలో మైనర్ బాలికపై పాస్టర్ అత్యాచారయత్నం ఘటన రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల తీవ్రతని తెలియజేస్తోంది. బాధిత బాలిక తండ్రి, మేనత్తతో ఫోన్లో మాట్లాడాను. బాలికకు అన్నగా అండగా ఉంటానని హామీ ఇచ్చాను. (1/2) pic.twitter.com/ubJQQO2YP8
— Lokesh Nara (@naralokesh) October 7, 2020
బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తికి కఠిన శిక్ష పడేలా వారి కుటుంబం చేస్తున్న పోరాటానికి టిడిపి అండగా ఉంటుంది. (2/2)
— Lokesh Nara (@naralokesh) October 7, 2020